భారతీయులకు కాస్తో కూస్తో అందుబాటులో ఉన్న డ్రగ్ డోలో 650.జ్వరం వచ్చిన వెంటనే వాడాల్సిన మందు ఇది.మైక్రో కంపెనీ తయారీ తో ఈ మందు ఇప్పుడు మార్కెట్లో విరివిగా లభిస్తోంది. ఎందరో రోగుల పాలిట ప్రాణ ప్రదాయినిగా ఉంది. ఇవాళ మూడు వందల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందంటే అందుకు కారణం ఈ రెండేళ్లలో ఈ మందు దక్కించుకున్న విపరీతం అయిన పాపులారిటీనే! ఇది ఒక్క రోజులో రాలేదు. కరోనా సమయంలో ఎక్కువగా వైద్యులు ఈ మందు వాడమని చెప్పి, ముందుగా జ్వరం నుంచి రోగిని కాపాడే ప్రయత్నం చేయడంతో డోలోకి విపరీతం అయిన క్రేజ్ వచ్చేసింది.అసలు ఏ మందుకు అయినా మార్కెట్లో కొరత ఉందేమో కానీ ఈ పారసిటమాల్ మాత్రకు అస్సలు కొదవే లేదు.పీహెచ్‌సీల్లో కూడా ఈ మందుల షీట్లు విరివిగానే ఉంటున్నాయి.దీంతో పల్లెల్లోనూ పట్టణాల్లోనూ డోలో 650 అంటే తెలియని వారే లేరంటే ఆశ్చర్యపోనసవరం లేదు.కరోనా సమయంలో ఎంత మెడికల్ మాఫియా రాజ్యమేలినా కూడా ఈ మందు విషయంలో మాత్రం అవేవీ చెల్లలేదు.
డెల్టా వేరియంట్ ఏమో కానీ ఒమిక్రాన్ మాత్రం పెద్దగా ఆందోళనకారి కాదు.నాలుగైదు రోజులు జ్వరం మాత్రం వెన్నాడుతూ ఉంటుంది.వీటితో పాటు ఒళ్లునొప్పులు,కాళ్లు పీకులు ఉంటాయి.ఇదే సమయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు ఈ వ్యాధి నుంచి గట్టెక్కవచ్చు.కనుక ఇప్పుడంతా డోలో 650 చుట్టూనే చక్కర్లు కొడుతున్నారు.
ఏదేమయినప్పటికీ మార్కెట్లోకి వందల మందులు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంటాయి.మార్కెట్లోకి వందల ఇంజెక్షన్లు వచ్చి మన ఇంటెలిజెన్స్ ను పరీక్ష పెడుతుంటాయి.అయినా మందులు ఏమయినా డాక్టరు సూచన మేరకే వాడుకోవాలి.పాపం పేదలు ప్రతిసారీ వైద్యుల చుట్టూ తిరగలేరు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రతిసారీ మంచి వైద్యం అందుతుందన్న గ్యారంటీ కూడా లేదు. అలాంటప్పుడు చిన్నపాటి జ్వరాలకు వైద్యుల కన్నా తెలిసిన చిన్న చిన్న మెడికల్ షాపులకే పేదలు పరుగులు తీస్తుంటారు.ఆ విధంగా వెళ్లి డోలో 650 ని తీసుకుని వచ్చి ఇంటికి వెళ్లి జ్వరం నయం అయ్యేదాకా వాడుతూ ఉంటారు.మొదట క్లిక్ అయింది ఇక్కడే.ఓ విధంగా ఇది పేదల మందు డోలో.చిన్నపాటి జ్వరాలకు సైతం పెద్ద పెద్ద దవఖానాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అని చాటి చెప్పిన మందు.వీలున్నంత వరకూ ప్రతి ఆరు గంటలకు ఓ టాబ్లెట్ వేసుకుంటే కరోనా సమయంలో వచ్చే జ్వరాలను నియంత్రణ చేసే మందు ఇదే అని తేలిపోయింది ఇవాళ.అందుకే జనం కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నారు ఆ మందు తయారీ కంపెనీకి…