ఆనందంగా ఉన్నప్పుడు అనవసర ఆలోచనలు వద్దు.. ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయండి..!

-

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక రోజు సుఖం ఉంటే ఒక రోజు కష్టం ఉంటుంది. కష్ట సుఖాలు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అనేది ఎవరు ఊహించలేము. నిమిషంలో కష్టసుఖాలు మారిపోతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది అటువంటి క్షణాలని చక్కగా అనుభవించాలి. ఏమి ఆలోచించకుండా ఆ క్షణాల్ని ఆస్వాదిస్తూ ఉండాలి.

 

ఆ క్షణాన్నే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అయితే చాలా మంది ఆనందంగా ఉండేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఆఖరికి ఆనందం వచ్చిన తర్వాత ఏదో ఆలోచనతో ఆ ఆనందాన్ని అనుభవించకుండా ఇంకో దాని కోసం ఆలోచించడం ఆ క్షణాన్ని అనుభవించకుండా ఆ క్షణంలో కూడా బాధ పడటం వంటివి చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆ క్షణం అనుభవించడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి ఎన్నో అవరోధాలను దాటుకుంటూ వస్తాము.

అలాంటప్పుడు ఒక సారి బ్రెయిన్ చేసే పనికి బ్రేక్ ఇచ్చేసి ఏ ఆలోచనలు లేకుండా ఆ క్షణాన్ని చక్కగా ఆస్వాదించండి. తర్వాత ఏమవుతుంది అనేది ఎవరు ఊహించలేము కాబట్టి ఖచ్చితంగా ఆ క్షణాన్ని మీరు ఎంజాయ్ చేయండి… ఫీల్ అవ్వండి.. అలానే మనం ఆనందంగా ఉండాలంటే ప్రస్తుతం మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం జరిగిపోయిన దాన్ని మనం మళ్లీ తిరిగి మార్చలేము. అలానే రేపు ఏమవుతుంది అనేది మనం చెప్పలేము. కనుక ప్రస్తుతాన్ని ప్రస్తుతం ఉండే ఆనందాన్ని మనం హార్ట్ ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. చాలామంది ప్రెజెంట్ లో ఆబ్సెంట్ అయిపోతూ ఉంటారు. ఆ తప్పుని ఎప్పుడు చేయొద్దు. ఆ క్షణం ఆనందంగా ఉంటే దాన్ని మరింత ఆనందంగా ఫీల్ అవ్వండి. ఇది నిజంగా మీకు శక్తిని కూడా ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news