ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌: రేస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

-

తెలంగాణతో పాటు.. దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న ఫార్ములా రేస్.. ఇండియన్ రేసింగ్ లీగ్ కాసేపట్లో ప్రారంభమైంది. అయితే.. క్వాలిఫైయింగ్ 1, 2 తర్వాత రేస్ 1 స్పిన్ట్​ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ రేసింగ్‌లో 12 కార్లు.. 6 బృందాలు పాల్గొన్నాయి. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందర్భంగా నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ప్రారంభమైంది. స్ట్రీట్‌ సర్క్యూట్‌పై స్పోర్ట్స్‌ కార్లు రయ్‌.. రయ్‌ మంటూ పరుగులు తీశాయి. రేసింగ్‌కి ముందు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. క్వాలిఫైయింగ్ 1, 2 తర్వాత రేస్ 1 స్పిన్ట్​ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 3.10 గంటల నుంచి 3.20 గంటల వరకు క్వాలిఫయింగ్-1 డ్రైవర్ ఏ బృందం, 3.30 నుంచి 3.40 నిమిషాల వరకు క్వాలిఫయింగ్‌-2 బి బృందం రేస్‌ ప్రారంభించింది.

Image

సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు మెయిన్‌ రేస్‌ జరిగింది. 2023 ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ ప్రిపరేషన్‌లో భాగంగా ఇవాళ, రేపు ఇండియన్‌ రేసింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇవాళ పెట్రోల్‌ కార్లతోనే రేస్‌ నిర్వహించారు. ఈ రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు, నలుగురు డ్రైవర్లు, మహిళా రేసర్లు పాల్గొన్నారు. 50శాతం దేశంలోని రేసర్లు, మరో 50శాతం విదేశీ రేసర్లు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో పాల్గొన్నారు. పెట్రోల్‌ కార్లు 240కి.మీ స్పీడ్‌తో వెళ్లాయని, ఎలక్ట్రిక్‌ కార్లయితే గరిష్ఠ వేగం 320 కి.మీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news