కలలో మీరు వంతెన దాటుతున్నట్లు కనిపించిందా..అయితే మంచిదే..కానీ ఈ రకమైన కలలు వస్తే మాత్రం అశుభమే..!

-

నిద్రించేప్పుడు వచ్చేకలకు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవి మన భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే చెప్పేదానికి సంకేతాలు. కొన్ని కలలు శుభప్రదం అవుతాయి. మరికొన్ని చెడ్డవి కూడా అవుతాయి. అలా మనల్ని హెచ్చరిస్తాయి. అయితే చాలా కలలు తెల్లారగానే..అవి తెల్లారతాయి. అసలు గుర్తుకు ఉండవు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వస్తువులు, సంఘటనలు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
శంఖం కలలో శంఖం కనిపించడం చాలా అరుదు. కలలో శంఖం కనిపిస్తే.. నారాయణుడు, లక్ష్మీ దేవి కనిపించారని అర్థమట. అది చాలా మంచిది. వీరికి సంపద, ఆనందాలు పెరబోతున్నాయి.కలలో పక్షులు కనిపిస్తే.. చనిపోయిన వ్యక్తి పక్షి రూపంలో కలలోకి వచ్చడాని అర్థం. పక్షి కనిపిస్తే.. సంపాదన పెరగడమే కాకుండా.. శుభ సుచికం కూడా..కలలో పండ్ల బుట్ట కనిపిస్తే.. ఇంటికి కొత్త అతిథి రాబోతున్నారని సంకేతమట. అలాగే స్త్రీకి ఆపిల్ తినే కల వస్తే… వారికి పిల్లలు కలుగుతారని అర్థం. కలలో ముంగిస కనిపిస్తే చాలా మంచిది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం. అలాగే.. బంగారం, వెండి పొందుతారని సంకేతమట. ఎర్ర చీరలో స్త్రీ కలలో కనిపిస్తే… లక్ష్మీ దేవి దర్శనం ఇచ్చినట్లుగా అర్థం. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతున్నాయమి స్వప్నశాస్త్రం చెప్తోంది.
కలలో మీరు ఆకాశంలో నల్లటి మేఘాలను చూస్తే వ్యాపారాన్ని కోల్పోవచ్చు. కలలో తేనెటీగ కనిపిస్తే మీరు ఎక్కడి నుంచైనా డబ్బు పొందబోతున్నారని సంకేతమట. కలలో ఏనుగు, ఎద్దు , సింహం, సముద్రం చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. త్వరలో డబ్బు అందుకోబోతున్నారని వాటికి అర్థంమట. మీరు కలలో వంతెన దాటుతున్నట్లు అనిపిస్తే ఆర్థిక చింతల నుంచి బయటపడబోతున్నారని ఆ కలకు సంకేతం. వ్యాపారంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని అర్థమట.
కలలో మీ చొక్కా బటన్ కుట్టడం చూస్తే త్వరలో మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థమట…కానీ చొక్కా బటన్ విరిగి అదే కలలో పడితే మీరు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మీరు కలలో పసుపు లేదా వివాహం చూస్తే త్వరలో ఎక్కడి నుంచైనా డబ్బు వస్తుందని సంకేతం.
గమనిక: పై కథనానకి ఎలాంటి ఆధారాలు లేవు. పాఠకులు ఆస్తకిని దృష్టిలో పెట్టుకుని స్వప్నశాస్త్రం ప్రకారమే మీకు ఈ సమాచారం అందించబడిందని గమనించగలరు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news