టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ కొత్త ఇన్నింగ్స్ షురూ చేసేశాడు. అవును.. యువరాజ్-హేజెల్ కీచ్ దంపతులు… ఓ పండంటి బిడ్డకు జన్మనించారు. ఈ గుడ్ న్యూస్ ను తన ట్విట్టర్ అకౌంట్ ఓ షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ తమ గోప్యతను గౌరవించాలని కోరారు యూవీ.
”దేవుడు మాకు కుమారున్ని ఇచ్చాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేవునికి కృతజ్ఙతలు చెప్పుతూ.. మా గోప్యతను గౌరవించాలని అడుగుతూ.. మా బిడ్డను ప్రపంచంలోకి వెల్ కమ్ చెబుతున్నాము. లవ్, హాజెల్, యువరాజ్ ” అంటూ యూవీ పోస్టు చేశారు.
ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఖుషీ అవుతున్నారు. యువరాజ్ సింగ్ తండ్రి అయినందుకు అందరూ అభినందనలు చెబుతున్నారు. కాగా.. టీ 20 ప్రపంచ కప్ 2007, 2011 లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో హీరోగా నిలిచిన యూవీ 2019లోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.