నందమూరి ఫ్యామిలీకి జగన్‌ శుభవార్త..ఎన్టీఆర్‌, హిందూపురం జిల్లాల ఏర్పాటు

ఏపీ సర్కార్‌ కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1974 ఏపీ జిల్లాల (ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు చేశారు. ఈ మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్‌. ఫిబ్రవరి 26 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా.. జిల్లాలకు ప్రత్యేక పేర్లతో నోటిఫికేషన్ లు విడుదల చేసింది. 15 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ లు జారీ చేసింది ప్రభుత్వం.

30 రోజుల పాటు సలహాలు, అభ్యంతరాలు స్వీకరణ ఉండనుంది. అయితే… ఈ కొత్త జిల్లాల ఏర్పాటులో… నందమూరి కుటుంబానికి జగన్‌ ఓ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏపీలో కొత్తగా ఎన్టీఆర్‌, హిందూపురం జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తూ.. జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ పార్లమెంట్ జిల్లా ఉండనుండగా… హిందూపురాన్ని ప్రత్యేకంగా జిల్లా చేశారు. జగన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో నందమూరి ఫ్యాన్స్‌ తో పాటు, టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.