ఇలా కూడా డబ్బులు సంపాదించచ్చు తెలుసా…?

Join Our Community
follow manalokam on social media

భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారా..? అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇప్పటి నుంచే డబ్బులు వెనకేయ్యాలని అనుకుంటున్నారా…? అయితే మీకు మంచి ఆప్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మీరు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయితే దీని కోసం కొన్ని ఏళ్ళు ఆగక తప్పదు. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి మొత్తాన్ని మీరు పొందొచ్చు. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

సాధారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేనిలో దానిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఇలా సంపాదించుకునే వాళ్ళకి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. అలానే కాస్త సమయం ఆగాల్సి ఉంటుంది. వెంటనే లక్షాధికారి అయిపోవాలంటే అస్సలు అవ్వదు. దీనిలో డబ్బులు పెట్టి మీరు ఎదురు చూడాలి. 30 ఏళ్ల వయసున్న వారు ఉద్యోగం చేస్తుంటే 60 ఏళ్లకు రిటైర్ అవుతారు.

30 ఏళ్ళ వయసు వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రిటైర్ అయ్యే నాటికి మంచి రాబడి వస్తుంది. అలానే అప్పుడు మీరు ఏ చింతా లేకుండా ఉండొచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం డబ్బులు పెడితే 12 శాతం వరకు రాబడి వస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

కంపౌండింగ్ ప్రయోజనాలు కూడా దీని ద్వారా లభిస్తాయి. అందుకే చాలా మంది దీనిలో ఎన్నో
ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే దీనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలా డబ్బులు వస్తాయి అనే విషయాన్ని కూడా చూసేద్దాం… ఉదాహరణకు మీరు ప్రతి నెల ఈక్విటీ ఫండ్స్ లో 1050 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం రాబడి ప్రకారం చూస్తే మెచ్యూరిటీ అయ్యే సమయంలో మీకు ముప్పై ఏడు లక్షల రూపాయలు వస్తాయి.

 

 

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...