ఓర్నీ.. ఇదేం టాలెంట్‌రా బాబు.. చూయింగ్‌ గమ్‌ నములుతూ.. నెలకు వేలల్లో సంపాదన..!

-

ఒకప్పుడు పైకి రావాలంటే జనాలు చాలా కష్టపడాల్సి వచ్చేది.. ఇప్పుడు ఈ సోషల్‌ మీడియా వచ్చాకా.. కాస్త వెరైటీగా ఉంటే చాలు.. ఓవర్‌ నైట్‌ స్టార్స్‌ అయిపోవచ్చు. కొన్నిసార్లు.. ఎందుకు పనికిరాదు అనుకున్నది.. సామాజిక మాధ్యమాల వల్ల తెగ ఫేమస్‌ అవుతుంది. యువత తమకున్న క్రేజీ అలవాట్లు.. ఇక దాన్ని పిచ్చి అంటారో, వెర్రి అంటారో ఏమన్నా అననీ కానీ.. జనాలకు మాత్రం అవే నచ్చుతాయ్‌ అనుకోండి.. ఆ టాలెంట్స్‌తో దండిగా పైసల్‌ సంపాదిస్తున్నారు.. చాలామంది గిట్లనే అనుకుంటారు కదా..! టైమ్‌పాస్‌కు నమిల్‌ చుయింగమ్‌తో ఈ అమ్మాయి నెలకు రూ. 67 వేలు సంపాదిస్తోంది..! అట్లెట్ల ఐతుంది, అసలేంది కథ అనేగా మీ డౌట్.. ఇక స్టోరీ షూరు చేద్దామా..!!

జర్మనీకి చెందిన ఓ యువతికి ఓ అరుదైన టాలెంట్ ఉంది. ఆమె చూయింగ్ గమ్ నములుతుంది. మనం కూడా చూయింగ్‌ గమ్‌ నమిలి బుగ్గలు చేస్తాం కదా..! కానీ ఆమె పెద్ద పెద్ద బెలూన్లు చేస్తుంది. ఎంత పెద్దవంటే ఆమె తలకన్నా పెద్దవి. ఇందుకోసం ఆమె ముప్పై చూయింగ్ గమ్ లు నోట్లో వేసుకుని నములుతుందట.. ఆమె నెలకు 480 రూపాయలు పెట్టి చూయింగ్ గమ్‌లు కొంటుంది. వచ్చే ఆదాయం మాత్రం 67000 రూపాయలు. ఓడియమ్మ ఈ దందా ఏదో బాగుంది అనిపిస్తోందా..!

ఆమె పేరు.. జూలియా. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఆమె టాలెంట్‌ను చూసిన స్నేహితుడు సలహా మేరకు తన ఫోటోలను అమ్మడం ప్రారంభించింది. పెద్ద బుడగలు ఊదిన ఫోటోలను, వీడియోలను ప్రజలు ఇష్టపడుతుండడంతో వాటిని జర్మనీలోని కొన్ని ఆన్ లైన్ సైట్లలో పెట్టి అమ్మడం ప్రారంభించింది. కొంతమంది తమకు ఎలాంటి ఫోజుల్లో బుడగలు ఊదుతూ ఫోటోలు కావాలో కూడా అడిగేవారట.. అలానే ఫోటోలు తీసి పంపిస్తుంది. ఆమె వీడియోలు, ఫోటోలు జర్మనీలో వైరల్‌గా మారాయి.

ఎంతో మంది అభిమానులు కూడా పోగయ్యారు..ఇంకేముందు.. సరదాగా తాను చేసే పని కూడా ఇలా డబ్బులు సంపాదించి పెడుతుంది. ఇరవై నుంచి ముప్పై చూయింగ్ గమ్‌లు నోట్లో వేసుకుంటే చాలు పెద్ద పెద్ద బుడగలు ఊదవచ్చు. ఈమెలా చేయాలని చాలా మంది అక్కడ ప్రయత్నించారు కానీ, ఎవరూ అంత పెద్ద బెలూన్లు ఊదలేకపోయారు. పెద్ద బెలూన్లు ఊదడానికి చిన్న కిటుకు ఉందని, అది తాను బయటికి చెప్పనని, స్నేహితుల్లో కొందరికి మాత్రమే తెలుసు అని అంటోంది ఈ జూలియా. మీకు కూడా చూయింగ్‌గమ్‌ తిని బెలూన్లు ఊదాలనే ఆసక్తి ఉందా..!

Read more RELATED
Recommended to you

Latest news