కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు సంతోషంగా లేరని చెప్పడం అబద్దం : మల్లు రవి

-

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆ పార్టీని వీడుతున్నట్లు నిన్న ప్రకటించడంతో పాటు.. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానంటూ వెల్లడించారు. తాజాగా రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై.. కాంగ్రెస్ నేత మల్లురవి స్పందిస్తూ.. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ కు రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆయనకు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అవకాశాలు ఇచ్చిందని.. అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీని వీడారని మండిపడ్డారు మల్లురవి. బీజేపీలో చేరడానికే మోడీ, అమిత్ షాను పొగుడుతున్నారని..కాంగ్రెస్ లోనే ఉంటూ బీజేపీకి పనిచేశారని ఆరోపించారు మల్లురవి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ పనితీరుకు మెచ్చి అధిష్ఠానం పీసీసీ చీఫ్ గా అవకాశం ఇచ్చిందన్నారు మల్లురవి.

Hyderabad: Mallu Ravi hits out at TRS leaders

రాజగోపాల్ రెడ్డి మాటకు కాంగ్రెస్ శ్రేణులు సమాధానం చెబుతారని..పార్టీలో ఎవరు సంతోషంగా లేరని చెప్పడం అబద్దమన్నారు మల్లురవి. కాంగ్రెస్ గాలికి అన్ని పార్టీలు కొట్టుకుపోతాయని మల్లు రవి అన్నారు మల్లురవి. రేవంత్ పీసీసీ అయ్యాక దళిత గిరిజన సభలు, జంగ్ సైరన్ లు చేశాడన్నారు మల్లురవి. రైతు డిక్లరేషన్ విడుదల చేశాం..త్వరలో సిరిసిల్లలో యూత్ డిక్లరేషన్ ను విడుదల చేస్తామన్నారు మల్లురవి. ఇందిరా గాంధీ హయాంలో జనతా పార్టీలో చేరిన వారంతా శంకరగిరి మాన్యాల్లో కలిసి పోయారని ఎద్దేవా చేశారు మల్లురవి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ను విడిచిపెట్టిన వాళ్లకు అదే గతిపడుతుందని..ఈటెల కూడా రేవంత్ పై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడం బాధాకరమన్నారు మల్లురవి.

 

Read more RELATED
Recommended to you

Latest news