చూయింగ్ గ‌మ్‌ల‌ను తింటే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌.. షాకింగ్‌..!

చూయింగ్ గ‌మ్‌ల‌ త‌యారీలో E171 (titanium dioxide nanoparticles) అనే స‌మ్మేళ‌నాన్ని వాడుతార‌ట‌. ఇది చూయింగ్ గ‌మ్‌ల‌కు ఒక నిర్దిష్ట‌మైన రంగును ఇస్తుంది.

మ‌న‌లో అధిక శాతం మందికి చూయింగ్ గ‌మ్‌ల‌ను తినే అల‌వాటు ఉంటుంది. కొంద‌రు రోజూ అదే ప‌నిగా చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌ములుతుంటారు. దీని వ‌ల్ల ముఖానికి వ్యాయామం జ‌రుగుతుంద‌ని చెప్పి కొంద‌రు చూయింగ్ గ‌మ్‌ల‌ను బాగా తింటుంటారు. అయితే నిజానికి చూయింగ్ గ‌మ్‌లు మ‌న ఆరోగ్యానికి మంచివి కావ‌ట‌. వాటిని తింటే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

చూయింగ్ గ‌మ్‌ల‌ త‌యారీలో E171 (titanium dioxide nanoparticles) అనే స‌మ్మేళ‌నాన్ని వాడుతార‌ట‌. ఇది చూయింగ్ గ‌మ్‌ల‌కు ఒక నిర్దిష్ట‌మైన రంగును ఇస్తుంది. అయితే మ‌నం చూయింగ్ గ‌మ్‌ను తిన్న‌ప్పుడు ఈ స‌మ్మేళ‌నం కూడా మన జీర్ణాశ‌యంలోకి వెళ్లి అటు నుంచి ఇది పేగుల‌లోకి వెళ్లి అక్క‌డ బాక్టీరియాను వృద్ధి చేసి క్యాన్స‌ర్ వ‌చ్చేలా చేస్తుందట‌. దీంతో పెద్ద పేగు క్యాన్సర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివ‌ర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ వాయిసెస్కీ ఎలుక‌ల‌పై తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లో పై విష‌యం వెల్ల‌డైంది. దీంతో ఎవ‌రూ చూయింగ్ గ‌మ్‌ల‌ను తిన‌రాద‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే పైన చెప్పిన ఆ E171 అనే ప‌దార్థాన్ని కేవ‌లం చూయింగ్ గ‌మ్‌ల‌లో మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర ఆహార ప‌దార్థా త‌యారీలోనూ వాడుతారట‌. క‌నుక మీరు బ‌య‌ట కొనుగోలు చేసి తినే ప్యాక్డ్ ఫుడ్స్‌ల‌లో ఈ స‌మ్మేళ‌నం ఉందో, లేదో వెరిఫై చేసుకుని మ‌రీ ఆ ఆహారాల‌ను తినండి. లేదంటే అన‌వ‌స‌రంగా క్యాన్స‌ర్ తెచ్చుకున్న వార‌వుతారు. ఆ త‌రువాత ఎంత బాధ‌ప‌డినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు..!