ఇంగ్లీష్ టీచర్… ఇంగ్లీష్ పదాలు చదవలేరు… గవర్నమెంట్ టీచర్ సస్పెండ్…! వైరల్ వీడియో

-

ఇంగ్లీష్ పదాలు చదవలేనందుకు గాను ఓకే టీచర్ ని సస్పెండ్ చేసిన ఘటన సికందర్‌పూర్ సరౌసిలో చోటు చేసుకుంది. చాలా మంది ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లీష్ బోధన అనేది సరిగా రాదనే విమర్శలు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. వాళ్ళు చూసి చదవడానికి కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారని ఏదో ప్రభుత్వం నిర్వహించిన పరిక్షల ఆధారంగా వాళ్ళను టీచర్లు గా నియమించడం దారుణమని, విద్యార్ధుల భవిష్యత్తుతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి అనే విమర్శలు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి.

తాజాగా ఇది రుజువు అయింది… ప్రభుత్వ పాఠశాల తనిఖీ సందర్భంగా సికందర్‌పూర్ సరౌసిలో జిల్లా  మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ పాండే ఒక ఇంగ్లీష్ టీచర్ ని 8 వ తరగతి ఇంగ్లీష్ టెక్స్‌బుక్ నుండి కొన్ని పదాలు చదవమని కోరారు… విద్యార్ధుల ముందే ఆయన ఆమెకు… ఈ పరీక్ష పెట్టారు. అయితే ఆమె చదవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేజిస్ట్రేట్ ఆమెను సస్పెండ్ చేయమని ఆదేశించగా డిఎం వెంటనే ఆమెను సస్పెండ్ చేసారు. మీరు ఒక గ్రాడ్యుయేట్ కనీసం చదవలేరని… తాను ఏమీ అనువందించమని చెప్పలేదని, అర్ధాలు అడగలేదని

కేవలం చదవమనే చెప్పాను అని ఆయన అసహనం వ్యక్తం చేసారు. స్కూల్ హెడ్ మాస్టర్ పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్ధుల భవిష్యత్తుతో ప్రభుత్వాలు ఏ విధంగా ఆడుకు౦టున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని… విషయం లేని వాళ్ళను టీచర్లుగా పెట్టడం ఏంటి అని… అందుకే ప్రభుత్వ స్కూల్స్ లో తమ పిల్లలను చేర్చడానికి తల్లి తండ్రులు ఆసక్తి చూపించరని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news