జైబోలో గంధం గణేశుడికి.. జై!

-

ఇది వినాయక చవితి సీజన్. ఇప్పుడు ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహాలే. వినాయక చవితి సందడి కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ లో అయితే.. ఎక్కడ చూసిన వినాయక విగ్రహాలే కనిపిస్తున్నాయి. చాలా మంది వినాయకుడి విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి తో తయారు చేస్తారు. ఇంకొంచెం వెరైటీ ఉండాలనుకునేవాళ్లు థర్మకోల్, బియ్యం, కూరగాయలు, కరెన్సీ నోట్లు, ఇతర వస్తువులతోనూ తయారు చేస్తారు. కానీ.. ఇప్పటి వరకు ఎప్పుడైనా గంధంతో తయారు చేసిన వినాయకుడిని చూశారా? లేదు.. అస్సలు చూడలేదు. అంటారా? అయితే.. ఇప్పుడు చూడండి.

నగరంలోని కవాడిగూడలో ఈ గంధం గణపయ్యను తయారు చేస్తున్నారు. గంధం అంటేనే తెలుసు కదా.. ఎంత సువాసన వస్తుందో. ఆ గంధం గణపతి కూడా భక్తులకు మంచి సువాసన వెదజల్లనున్నాడు. అయ్యప్ప స్వామిలా గంధంతో ఈ వినాయకుడిని తయారు చేస్తున్నారు. గోగ్రీన్ గణేశ్ అసోసియేషన్ సభ్యులు దాదాపు 200 కిలోల గంధంతో 22 ఫీట్ల వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఈ గణేశుడి విగ్రహం తయారు చేయడానికి సుమారు 11 లక్షలు ఖర్చయిందట. తయారీలో అన్నీ సహజ రంగులనే వాడుతున్నారట. ఇన్ని విశేషాలు ఉన్న ఈ గంధం గణపయ్యను చూడటానికి భక్తులు పండుగ ప్రారంభం కాకుముందే అక్కడికి క్యూ కడుతున్నారు. దీంతో నిర్వాహకులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. గతేడాది గోగ్రీన్ గణేశ్ వాళ్లు 65 ఫీట్ల మట్టి వినాయకుడిని తయారు చేసి వార్తల్లొక్కెకారు. ఈసారి గంధం వినాయకుడిని చేసి మళ్లీ వార్తల్లోకెక్కారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version