గర్ల్‌ఫ్రెండ్ ఉంగరాన్ని దొంగలించి.. మరో యువతికి ప్రపోజ్..

Join Our Community
follow manalokam on social media

ఇష్టమైన వ్యక్తులకు తమ మనసులోని మాట చెప్పేందుకు కొందరు వాలంటైన్స్ డే కోసం ఎదురు చూస్తుంటారు. ఈ రోజు ప్రియుడు తన ప్రేయసి కోసం రింగు, గులాబీ పూలు, చాక్లెట్లు తీసుకుని ప్రపోజ్ చేస్తుంటారు. వీరి ఆలోచనల్నీ ప్రియురాలి చుట్టూనే తిరుగుతాయి. ఎలా ఇంప్రెస్ చేయాలని.. ఎలాంటి మంచి స్పాట్‌కి తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటారు. ఈ రోజు ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అయితే ఓ ప్రేమికుడు చేసిన తతంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.

ఓ ప్రేమ దొంగ.. మొదటి గర్ల్‌ఫ్రెండ్ తల్లి ఉంగరాన్ని దొంగిలించి.. మరో యువతికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆమెను కూడా మోసం చేసి నగదు, ల్యాప్‌టాప్ తీసుకుని పారిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడా దేశం ఆరెంజ్ సిటీకి చెందిన ఓ యువతికి తన బాయ్ ఫ్రెండ్ మరో యువతితో కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని అనుమానం వచ్చింది. ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పెట్టిన పోస్ట్‌ను చూసి.. అది తన తల్లి ఉంగరమే అని గుర్తించి.. ఆరా తీయడంతో ఆ వ్యక్తి గుట్టు రట్టైయింది.

ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను చూసి ఆమె తన జ్యూవెలరీ బాక్సులో ఉంగరం ఉందా.. లేదా అని చెక్ చేసుకుంది. బాక్స్ తెరిచి చూడగా అందులో డైమండ్ రింగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ డైమండ్ రింగ్ విలువ మార్కెట్‌లో 6,270 డాలర్లు ఉంటుందని (రూ.4,55,145) పోలీసులకు తెలిపింది. ఫేస్‌బుక్ పోస్ట్ ఆధారంగా ఆ అమ్మాయి ఓర్లాండోకు చెందినట్లు గుర్తించారు.

ఆ అమ్మాయిని సంప్రదించగా.. డైమండ్ రింగ్‌ను తన బాయ్‌ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పింది. ఆరెంజ్ సిటీకి చెందిన యువతిని అతడి బాయ్‌ఫ్రెండ్ పేరు అడగగా.. జాయ్ బ్రౌన్ అని, ఓర్లాండ్ యువతిని అడగగా.. మార్కస్ బ్రౌన్ అని చెప్పింది. తీరా అతడి ఫోటోలు చూపించమని అడిగితే ఇద్దరిని ఒక్కడే మోసం చేశాడని గుర్తించారు. ఒకరికి తెలియకుండా ఇద్దరిని దగ్గరి నుంచి విలువైన వస్తువులు దొంగిలించాడని గ్రహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నార్త్ కరోలినాలో అతని బంధువులు ఉన్నారని గుర్తించారు. అతడి పేరు జోసెఫ్ డవీస్ అని, ఇప్పటికే అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...