ఇండియాలో పెరుగుతున్న కరోనా టీకా మరణాలు…!

-

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ఇక శనివారం 84,800 టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక టీకా వేసుకున్న వాళ్ళు దాని ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. టీకాలు పొందిన ముగ్గురు వ్యక్తులు గత 24 గంటల్లో మరణించారు.

ఇప్పటివరకు టీకాలు వేసిన కేసులలో మరణాలు 27 గా నమోదయ్యాయి. అయితే వారికి అంతకుముందే అనారోగ్యాలు ఉన్నాయని టీకాలకు సంబంధించినవి కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తీవ్రమైన సమస్యలు ఉన్న వారే ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. టీకా డ్రైవ్ శనివారం మరింత వేగంగా ముందుకు వెళ్ళింది. నాలుగు వారాలతో పోలిస్తే ఒక్క రోజే అంత మందికి వ్యాక్సినేషన్ చేయడం రికార్డ్.

వారికి కరోనా వైరస్ వ్యాక్సిన్ యొక్క రెండవ మోతాదు 28 రోజుల విరామం తర్వాత ఇవ్వబడుతుంది. విలేకరుల సమావేశంలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు ఎంత మందికి టీకాలు వేసింది వివరించింది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 80,52,454 టీకాలు వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.అయితే టీకా మరణాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టామని వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news