ఈ సర్టిఫికెట్.. భవిష్యత్తులో చదివే అన్ని చదువులకు ఉపయోగపడుతుందట. వాళ్లు ఇచ్చిన సర్టిఫికెట్‌తో ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి చదువులూ చదవొచ్చు.
ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ(ఎన్‌ఐఓఎస్) గుడ్ న్యూస్ అందించింది. పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వాళ్లకు ఈ సంస్థ ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. మే 20 నుంచి 31 వరకు ఈ పరీక్షలను నిర్వహించనుంది. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 30 రోజుల్లో వాటి ఫలితాలను ప్రకటిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఈ నెల 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లయి చేసుకోవాలని ఎన్‌ఐఓఎస్ ప్రకటించింది.
ఎన్‌ఐఓఎస్‌లో మొత్తం ఐదు పరీక్షలు ఉంటాయి. ఐదు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఇంటర్‌లో పాసైన సబ్జెక్టులకు బదులు.. రెండు సబ్జెక్టులను స్కిప్ చేసి.. మూడు పరీక్షలను రాయాలి. విద్యార్థులు తమ గ్రూప్‌లోని సబ్జెక్టులనే కాకుండా.. తమకు నచ్చిన సబ్జెక్టుల్లోనూ పరీక్షలు రాయొచ్చని ఎన్‌ఐఓఎస్ అధికారులు తెలిపారు.
ఈ సర్టిఫికెట్.. భవిష్యత్తులో చదివే అన్ని చదువులకు ఉపయోగపడుతుందట. వాళ్లు ఇచ్చిన సర్టిఫికెట్‌తో ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి చదువులూ చదవొచ్చు. చాలా ఏళ్ల నుంచి ఇంటర్ పాస్ కాలేని విద్యార్థులు… ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.