ప్ర‌మోష‌న్ ఓకే.. హిట్ సంగ‌తేంటి..!

-

ప్ర‌మోష‌న్ వ‌ర‌కు ఓకే. మ‌రి హిట్ సంగ‌తేంట‌నేది ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పూరీ జ‌గ‌న్నాథ్‌కి స‌క్సెస్ లేక చాలా ఏండ్లు అవుతుంది. 2015లో ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన టెంప‌ర్ త‌ర్వాత ఒక్క హిట్ కూడా లేదు.

రామ్‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తొలిసారి ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం రూపొందుతుంది. సినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. తాజాగా వార‌ణాసి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇందులో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. సినిమాకి సంబంధించిన రెగ్యూల‌ర్ అప్ డేట్ ని ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు.

ప్ర‌మోష‌న్ వ‌ర‌కు ఓకే. మ‌రి హిట్ సంగ‌తేంట‌నేది ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పూరీ జ‌గ‌న్నాథ్‌కి స‌క్సెస్ లేక చాలా ఏండ్లు అవుతుంది. 2015లో ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన టెంప‌ర్ త‌ర్వాత ఒక్క హిట్ కూడా లేదు. జ్యోతిలక్ష్మి, లోఫ‌ర్, ఇజ‌మ్‌, రోగ్‌, పైసా వ‌సూల్‌, మెహ‌బూబా చిత్రాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇస్మార్ట్ శంక‌ర్‌తో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భావిస్తున్నారు.

హిట్ అనేది ఇప్పుడు మ‌స్ట్. ఎందుకంటే ఈ సినిమాపైనే త‌న ఆశ‌లు, ఆస్తులు పెట్టారు. ఓ ర‌కంగా త‌న లైఫ్‌నే రిస్క్ లో పెట్టారు పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమాని కూడా త‌న మార్క్ పంథాలో మార్పులు చేసుకుని మ‌రీ తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు హీరో రామ్‌కి కూడా హిట్ క‌రువైంది.

హైప‌ర్ త‌ర్వాత ఆయ‌న న‌టించిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గి, హ‌లో గురూ ప్రేమ కోస‌మే చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ ప‌రాజ‌యం చెందాయి. మార్కెట్ ప‌రంగా తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌నుకుంటున్నారు. హీరో పాత్ర‌ని బ‌లంగా, డేరింగ్‌గా చూపించ‌డం పూరీ ప్ర‌త్యేక‌త.

ఆద్యంతం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. పూరీ మార్క్ డేరింగ్ క్యారెక్ట‌ర్‌కి, రామ్ ఎన‌ర్జీ తోడ‌యితే సినిమా మ‌రో స్థాయిలో ఉంటుంద‌ని చెప్పొచ్చు. దీనికి తోడు ట్యాగ్‌లైన్ కూడా డ‌బుల్ దిమాక్ అని పెట్టారు. మ‌రి ఆ డ‌బుల్ దిమాక్ వ‌ర్కౌట్ అవుతుందా లేదో అనేది చూడాలి. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమా మ‌రో రెండు రోజుల్లో నెక్ట్స్ షెడ్యూల్‌ని జ‌రుపుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news