గూగుల్‌ పే నుంచి అదిరిపోయే అప్‌డేట్స్‌.. కొత్తగా 6 ఫీచర్స్..!

-

ఈరోజుల్లో డిజిటల్ ప్రపంచంలో యూపీఐ పేమెంట్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల హవా నడుస్తోంది. అందరూ యూపీఐ పేమెంట్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ లో ఫోన్ పే గూగుల్ పే వంటి అప్లికేషన్స్ కచ్చితంగా ఉంటున్నాయి. అయితే వీటి మధ్య గట్టి పోటీ అయితే నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూజర్లకు బెస్ట్ యూపీఐ పేమెంట్ సర్వీస్ అందించడానికి గూగుల్ పే కొత్త ఫీచర్స్ ని ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్ మరింత సులువుగా వేగంగా మార్చే ఆరు ఫీచర్లను తీసుకురావడం జరిగింది. ఇక ఈ కొత్త ఫీచర్లకి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.

యూపీఐ సర్కిల్ ఫీచర్ తో ప్రైమరీ యూపీఐ యూజర్ తో పాటుగా సెకండరీ యూజర్ కూడా అకౌంట్ ని ఉపయోగించడానికి అవుతుంది. ఐదు కంటే ఎక్కువ సెకండరీ యూజర్లను యాడ్ చేయడానికి అవ్వదు. ఈ ఫీచర్ తో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే యూపీఐ అకౌంట్ ని ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది.
భారత్ బిల్ పే భాగస్వామ్యంతో గూగుల్ పే క్లిక్ యువర్ స్కాన్స్ ప్రకటించింది. ఈ కొత్త పిక్చర్ తో ఆన్లైన్ బిల్ పేమెంట్స్ ఈజీ అవుతాయి. వినియోగదారులు ఇప్పుడు అకౌంట్ డీటెయిల్స్, యూజర్ ఐడి సమాచారాన్ని ఫిల్ చేయకుండా క్యూఆర్ కోడ్లని స్కాన్ చేయడం ద్వారా బిల్ పేమెంట్ చేయడానికి అవుతుంది.
యూపీఐ వినియోగదారులు ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలకి ప్రీపెయిడ్ యూపీఐ వోచర్స్ జారీ అవుతున్నాయి. ఈ ఓచర్లతో బ్యాక్ ఎకౌంట్ లింక్ చేయకుండా పేమెంట్ చేసే హక్కు ఉంటుంది.
అలాగే ఎన్పీసీఏ భాగస్వామ్యంతో గూగుల్ పే రూపే కార్డుతో ట్యాప్ చేసి పేమెంట్ చేసే ఫీచర్ ని తీసుకొచ్చింది. 16 అంకెల కార్డు నెంబర్ వంటి యూజర్ కార్డ్ వివరాలు గూగుల్ పే లో స్టోర్ కావాలి అని చెప్పింది.
గూగుల్ పే రికరింగ్ పేమెంట్ కేటగిరీకి ప్రీపెయిడ్ యుటిలిటీ యాడ్ చేయబోతోంది క్విక్ యూపీఐ పేమెంట్ కోసం అకౌంట్స్ ని లింక్ చేయగలరు.
వినియోగదారులు రికరింగ్ పేమెంట్స్ ట్రాక్ చేయడానికి, మ్యానేజ్ చేయడానికి సెంటర్లైజెడ్ ప్లాట్ఫారం అందించడం పై దృష్టి పెట్టబోతోంది.
యూపీఐ లైట్ ఆటో పే ఫీచర్ కూడా రాబోతుంది. బ్యాలెన్స్ తగ్గిన వెంటనే ఆటోమేటిక్గా టాప్ అప్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news