ఆనందం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే?

-

సాధారణంగా ఏదేని పండుగ జరుగుతుందంటే చాలు అందరి కంటే ఎక్కువ ఎంజాయ్ చేసేవారు పిల్లలే. పండుగ ఏదైనా సందడి చేయడం వారి అలవాటు అనే చెప్పొచ్చు. కాగా, ఓ ప్రాంతంలో పిల్లలు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారని భావించేలోపు విషాదం చోటు చేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

హర్యానాలోని కర్నల్ జిల్లా నగ్లా మేగా గ్రామంలో ఇటీవల శివరాత్రి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలోనే ఊరేగింపు ప్లాన్ చేశారు. ఓ వెహికల్‌లో డీజే బాక్సులు పెట్టుకున్నారు. డప్పులు కొట్టేవాళ్లు కూడా ఉన్నారు. డప్పు చప్పుళ్లను ఎంజాయ్ చేస్తూ డీజీ బాక్సులపై నిలబడి మరీ ఐదుగురు చిన్నారులు హ్యాపీగా గడుపుతున్నారు. శివనామ స్మరణ చేసుకుంటూ సాగిపోతున్నారు. గ్రామంలోని దారి మొత్తం జనాలు వెహికల్‌పై నున్న వారితో పాటు డ్యాన్స్ చేస్తున్న వారిని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారు వెళ్తున్న వెహికల్‌కు ఓ కరెంటు వైరు అడ్డొచ్చింది.

ఈ క్రమంలోనే ఆ కుర్రాళ్లలో ఒకడు అడ్డుగా ఉన్న కరెంటు వైరును తొలగిద్దామని అనుకున్నాడు. అందులో భాగంగా వైరను ఎత్తాలనే భావనలో ముట్టుకున్నాడు. అంతే కరెంట్ షాక్ వచ్చేసింది. అతడితో పాటు అతడిని ఆనుకని ఉన్న ఐదుగురికి కరెంట్ షాక్ తగిలింది. ఒక్కసారిగా ఆరుగురు కిందపడిపోయారు. ఓ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతా వారిని స్థానికులు హాస్పిటల్‌కు పంపారు. రెప్పపాటు క్షణంలో జరిగిన ఘటనను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంలో అంతలోనే విషాదంగా మారిందని వాపోయారు. హై వోల్టేజ్ ఉన్న వైరు కావడం వల్లే కరెంట్ ఈజీగా పాస్ అయిందని, తద్వారా బాలుడు మరణించాడని స్థానికులు పేర్కొన్నారు. శివుడి శోభాయాత్రలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం పట్ల గ్రామ పెద్దలు విచారం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news