ఈ రైతు తెలివికి హ్యాట్సాఫ్.. వినూత్న పరికరం తయారీ..

వ్యవసాయానికి అయ్యే ఖర్చు రోజురోజుకూ బాగా పెరిగిపోతుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కలుపులు, నాటు వేయడం వంటి పనులకు కూలీల కొరత బాగానే ఉంది. కాగా ఇప్పుడు ఓ రైతు చేసిన ప‌ని చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఆయ‌న చాలా సింపుల్‌గా ఓ ప‌రిక‌రాన్ని రూపొందించాడు. దాని ద్వారా ఇప్పుడు ఆ యువరైతు త‌న వ‌రి చేనులో కలుపు తీస్తున్నాడు. ఈ పరికరం తయారీ చేసేందుకుగాను సదరు యువరైతు యూట్యూబ్‌లో వీడియో చూశాడు.

అలా చాలా ఈజీగా ఇన్‌స్ట్రుమెంట్ తయారు చేసుకున్నాడు. సదరు యువ‌రైతు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటున్నారు. అతడి పేరు పుప్పాల శ్రీనివాస్‌. కలుపు తీసే ప‌రిక‌రాన్ని అచ్చుగుద్దిన‌ట్లుగా యూట్యూబ్‌లో చూసి తయారు చేసిన రైతు శ్రీనివాస్ తెలివికి స్థానికులు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఆయ‌న త‌యారు చేసిన ఈ కలుపు తీసే ప‌రిక‌రాన్ని చూస్తే ఎవ‌రైనా స‌రే చాలా ఈజీగా చేయొచ్చ‌ని అనుకుంటారు. కానీ, కొంచెం టెక్నిక్ ఉంటేనే అలా చేయొచ్చు.

ఈ పరికరం తయారీకిగాను సదరు యువరైతు పుష్పాల శ్రీనివాస్ రెండు ఇంచుల వెడల్పు, మూడు అడుగుల పొడవు ఉన్న ఒక ప్లాస్టిక్ పైపును వాడాడు. ఇంచులో సగం ఉండే గొలుసుల‌ను దాదాపుగా 25 అమర్చాడు. అలా అమర్చి తయారు చేయబడిన పరికరాన్ని పొలంలో దించేసి ఈజీగా క‌లుపు తీసేయొచ్చు. మొత్తంగా ఈ పరికరం త‌యారు చేయాలంటే రూ. 1,000 మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంద‌ని రైతు శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఈయన ఆవిష్కరణ గురించి తెలుసుకుని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు శ్రీనివాస్ గ్రేట్ అని పోస్టులు పెడుతున్నారు.