లేక్ కోమో.. ఏంటిది.. ఓ ప్రాంతం పేరు. సోషల్ మీడియాలో, జనాల్లో, సెలబ్రిటీల నోట్లో తెగ నానుతోంది ఈ పదం. దేనికి. అంటే.. బాలీవుడ్ స్టార్ నటులు దీపిక, రణ్ వీర్ సింగ్ పెళ్లి అదే ప్రాంతంలో జరగనుంది. ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలుండగా… వాళ్లు ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నట్టు.. వీళ్లే కాదు.. కొన్ని రోజుల కింద ముకేశ్ అంబానీ కూతురు ఈశా ఎంగేజ్ మెంట్ కూడా ఇక్కడే జరిగింది. అవును కదా. ఈ రిచ్ పర్సనాలిటీస్ అంతా తమ ఫంక్షన్లకు ఇదే ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు. అంటే దానికి కారణం లేకపోలేదు. ఏంటి ఆ కారణం అంటారా? పదండి తెలుసుకుందాం.
ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడుంది అంటే…ఇటలీలో ఉంది. ఇది ప్రకృతికి కేరాఫ్ అడ్రస్. సాధారణంగా పార్కులను మనుషులు సృష్టిస్తుంటారు. కానీ.. ఇక్కడ నాచురల్ గా పార్కులు ఏర్పడ్డాయి. లేక్ కోమ్ అనేది ఓ సరస్సు పేరు. వై ఆకారంలో ఈ సరస్సు ఉంటుంది. సరస్సు చుట్టూ కొండలు, కోనలు, చెట్లు సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాంతాన్ని టూరిస్టుల కోసం అభివృద్ధి చేశారు. ఆ సరస్సు చుట్టూ రిసార్టులను ఏర్పాటు చేశారు. ఆ లేక్ దాదాపు 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుందట.
లేక్ కోమో దగ్గర ఉన్న డెల్ బాల్బియానెల్లో అనే విల్లాలోనే దీపికా, రణ్ వీర్ వెడ్డింగ్ జరగనుంది. నవంబర్ 14, 15న కొంకణి, సింధి సంప్రదాయ పద్ధతిలో వాళ్ల పెళ్లి జరగనుంది. ప్రపంచంలోనే ఇంత సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రాంతం ఇక్కడ తప్ప మరెక్కడా లేదు. అందుకే రిచ్ పర్సనాలిటీస్ అంతా తమ వివాహ మహోత్సవాలు, ఎంగేజ్ మెంట్, ఇతర వేడుకలు జరుపుకోవడానికి లేక్ కోమోకు క్యూ కడుతున్నారు.
View this post on Instagram
#villadelbalbianello #tremezzina #lakecomo #glicine #wisteria www.villadelbalbianello.it
View this post on Instagram
#villadelbalbianello #fondoambienteitaliano #rain #lakecomo www.villadelbalbianello.it
View this post on Instagram
Italy: Visuals from Villa del Balbianello at Lake Como in Lombardy, the venue for the wedding ceremony of Deepika Padukone and Ranveer Singh. Preparations underway. pic.twitter.com/MuuBJXos50
— ANI (@ANI) November 11, 2018