ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా హాయిగా జీవితంలో ఉండాలని అనుకుంటారు. ప్రశాంతంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి. మనిషి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎంత డబ్బు ఉన్నా కూడా శాంతి అనేది చాలా ముఖ్యం. ప్రశాంతమైన జీవితము అందరికీ దొరకదు. అయితే కొన్ని అలవాట్లతో ప్రశాంతంగా ఉండవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో సగం రోజులు కష్టపడతారు. మిగిలిన సగం విశ్రాంతి తీసుకుంటారు. సరైన అలవాట్లు టిప్స్ ఫాలో అయితే జీవితాన్ని ప్రశాంతంగా గడపొచ్చు. మనకి ఆనందాన్ని ఎవరు ఇవ్వలేరు. సంతోషం మన మనసులో ఉందనే సత్యాన్ని గ్రహించాలి.
కృతజ్ఞత, సంతృప్తి భావన ఉంటే సరిపోతుంది. అలాగే జీవితంలో ఆనందంగా ఉంటాను అన్న సంకల్పం చాలా గొప్పది. కోరుకున్నది లభించినా లభించక పోయినా సంతోషంగా ఉంటాను అని చెప్పుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. మనిషి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు ఆ తప్పుల్ని నిత్యం గుర్తుంచుకొని బాధపడడం అసలు మంచిది కాదు. అదే విధంగా సంతోషంగా ఉండాలంటే వర్తమానంలో జీవించడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వండి.
ఎదుట వ్యక్తిపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వలన మానసిక అశాంతికి కారణమవుతుంది. ఎదుటి వారిపై ఎలాంటి అంచనాలని పెట్టుకోవడం మంచిది కాదు. అదే విధంగా జీవితం లభించిన ప్రతి అంశంపై కృతజ్ఞత కలిగి ఉండాలి. సహనం, ఓర్పు చాలా ముఖ్యం. ఏ పని అయినా ఓ రోజులో పూర్తి కాదు. కాబట్టి ఓపికతో ఉంటే పనులు పూర్తయిపోతాయి. ఇలా మీరు వీటిని ఫాలో అయినట్లయితే ప్రశాంత జీవితాన్ని గడపవచ్చు. ఎప్పుడు సంతోషంగానే ఉండొచ్చు.