భార్య భర్తల బంధం ఎంత అద్భుతంగా ఉన్నా కొన్ని కొన్ని విషయాలు మధ్య దాపరికం ఉండాలి. ఈ విషయాన్ని చాణక్యనీతి గంధంలో ఆచార్య చాణక్యుడు కూడా చెప్పారు. భార్యాభర్తల బంధం ప్రేమగా చక్కగా ఉండాలి. అయితే ఒక్కొక్కసారి చిన్నచిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా వాటిని మళ్లీ అడ్జస్ట్ చేసుకుని తిరిగి మళ్లీ ఆనందంగా జీవించాలి.
అయితే చాణక్య నీతి ప్రకారం భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాలను భార్యకి చెప్పకూడదు. మరి చెప్పకూడని విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. భార్యకి తన భర్త ఎంత సంపాదిస్తున్నాడు ఎంత ఆదాయం వస్తుంది అనేది చెప్పకూడదు అని చాణక్య నీతి చెబుతోంది.
భర్త ఆదాయం వారికి తెలిసినప్పుడు ఇంట్లో అనవసర ఖర్చులు పెరిగి పోతాయి. కాబట్టి భర్త యొక్క ఆదాయాన్ని భార్యకి చెప్పకూడదు. అలెన్ మీ భర్త యొక్క బలహీనత కూడా వారికి తెలియ చేయకూడదు. మీ బలహీనత బయటపడడం వల్ల భార్య ఎప్పుడూ అడ్డు పడుతుంది. అలాగే భర్తకి కలిగిన అవమానం గురించి కూడా భార్యతో చెప్పకూడదు.
ఆ అవమానం గురించి కనుక మీరు ఒకసారి మీ భార్యకు చెబితే ఆ ప్రస్తావన ఇంట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా చెప్పకూడదు. అదే విధంగా మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అది మీ భార్యకి చెప్పు ఎవరికైనా మీరు సహాయం చేయాలనుకుంటే ఆమె అడ్డుపడుతుంది కాబట్టి దీనిని కూడా ఆమెకి చెప్పకూడదు.