మద్యం మత్తులో పోలీసును ముద్దాడి అడ్డంగా బుక్కయిన మందుబాబు.. వైరల్ వీడియో

527

వీళ్ల డ్యాన్స్ ను వీడియో తీస్తున్నవాళ్లే.. మనోడు ఎస్ఐకి పెట్టిన ముద్దును తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనిషి మందు తాగాక ఒక రకంగా.. తాగక ముందు ఒక రకంగా ఉంటాడట. ఎందుకంటే.. లోపలికి వెళ్లిన మందు అలాగే ఉండదు కదా. అది మనిషితో చేయించరాని పనులన్నీ చేయిస్తుంది. మాట్లాడకూడని మాటలన్నింటినీ మాట్లాడిస్తుంది. కిక్కు కూడా ఎక్కిస్తుంది. స్వర్గంలో తేలిపోతున్నట్టు ఉంటుంది. అందుకే కదా… చాలామంది మందుకు దాసోహం అంటారు. ఓ పెగ్గేస్తే కానీ.. మనసు ప్రశాంతంగా ఉండదు. బాధ, సంతోషం, ఆనందం, ఆక్రోశం, కోపం.. ఇలా ఏదొచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కావాల్సింది మందే. మందే మనకు మిత్రుడు.. మందే మనకు శత్రువు.

Hyderabad man kisses cop during Bonalu procession

అయితే.. మద్యం తాగడం వరకు ఓకే కానీ.. మద్యం మత్తులో ఏదేదో చేస్తే మత్తు దిగాక కానీ.. మనం చేసిన తప్పేంటో గుర్తుకు రాదు. భాను అనే 28 ఏళ్ల యువకుడు కూడా ఇప్పుడు తల బాదుకుంటున్నాడు. ఎందుకంటే.. మనోడు మద్యం మత్తులో ఏకంగా ఓ ఎస్ఐనే ముద్దు పెట్టుకున్నాడు.

నిన్న బోనాల పండుగ జరిగింది కదా హైదరాబాద్ లో. బోనాల సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నల్లకుంటలో బోనాల ఉత్సవాలు జరుగుతుండగా… మల్కాజ్ గిరికి చెందిన భాను అనే యువకుడు.. నల్లకుంటలో బోనాల పండుగలో పాల్గొనడానికి వెళ్లాడు. అక్కడ అందరితో పాటు డ్యాన్స్ చేస్తున్నాడు. అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి ఉన్నాడు భాను.

మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా… అటుగా వెళ్తున్న ఓ ఎస్ఐని పట్టుకొని ముద్దు పెట్టాడు. నల్లకుంట పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ అతడు. మనోడి వింత చేష్టలకు ఆ పోలీసు కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకున్న ఆ ఎస్ఐ.. భానుకు ఒక్కటిచ్చాడు. వెంటనే భాను ఏమీ ఎరగనట్టు వెళ్లి మిగితా వాళ్లతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు.

అయితే.. వీళ్ల డ్యాన్స్ ను వీడియో తీస్తున్నవాళ్లే.. మనోడు ఎస్ఐకి పెట్టిన ముద్దును తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే.. అది అక్కడితే సమసిపోలేదు. ఠాట్.. మా ఎస్ఐకే ముద్దు పెడతావా? అంటూ నల్లకుంట పోలీసులు మనోడి మీద కేసు పెట్టి లోపలేశారు.

అయితే.. దీనిపై స్పందించిన భాను.. పోలీసులు ప్రజల కోసం పడుతున్న పాట్లను చూసి వాళ్లను అభినందించడానికి అలా ఆ ఎస్ఐకి ముద్దిచ్చాను తప్పితే మరో ఉద్దేశంతో కాదని తెలిపాడు. అయినప్పటికీ.. పోలీసులు ఊరుకుంటారా? మనోడిపై కేసు నమోదు చేశారు. చూశారా? అత్యుత్సాహం ఎంత దూరం వెళ్లిందో. ఇంతకీ.. మనోడు ఆ ఎస్ఐకి పెట్టిన ముద్దుకు సంబంధించిన వీడియోను చూస్తారా?


(Video Courtesy: Telangana Today)