చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు బిస్కెట్లు.. నాగబాబుకు తిట్లా.. శివాజీరాజాపై హైపర్ ఆది ఫైర్

-

చిరంజీవి అంటే నాకు ఇష్టం అని చెప్పి నాగబాబును తిడితే ఆయనకు నచ్చుతుందా? పవన్ కల్యాణ్ అంటే ప్రాణం అని చెప్పి ఆయన పార్టీ తరుపున పోటీ చేస్తున్న నాగబాబుకు ఓటేయొద్దని చెబితే అది పవన్ కల్యాణ్‌కు నచ్చుతుందా?

మీకు నాగబాబు ఎప్పటి నుంచి తెలుసో మాకు తెలియదు కానీ.. మాకు మాత్రం నాగబాబు గత ఐదేళ్లుగా తెలుసు. ఆయనతో కలిసి ఐదేళ్ల నుంచి పని చేస్తున్నాం. ఈ ఐదేళ్లలోనే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయనపై అనవరసర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ప్రజా సమస్యలు తీరుస్తారా లేదా అనేది పక్కన బెట్టండి. ముందు మీ గురించి ఆలోచించండి. మీరు ఎవరికీ నచ్చకనే మా ఆసోసియేషన్‌లో మిమ్మల్ని గెలిపించలేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కాదు. చిరంజీవి అంటే ఇష్టం.. పవన్ కల్యాణ్ అంటే ఇష్టం.. అని వాళ్లు బిస్కెట్లు వేసి.. నాగబాబును తిట్టాల్సిన అవసరం లేదు.. మీరు ఏం చేసేది జనాలు చూస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా? అని హైపర్ ఆది.. మా మాజీ ప్రెసిడెంట్ శివాజీరాజాపై ఫైర్ అయ్యారు.

జనసేన నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. శివాజీరాజా ప్రెస్‌మీట్ పెట్టి.. నాగబాబుకు ఎవరూ ఓటెయ్యొద్దు అని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో శివాజీరాజాకు హైపర్ ఆది పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.

నాగబాబు పిల్లికి భిక్షం కూడా పెట్టరు అంటూ మాట్లాడుతున్న శివాజీ రాజా… ఎవరి భిక్షంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా రెండేళ్లు పనిచేశారని ఆది ప్రశ్నించారు. నాగబాబు గురించి శివాజీ మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదని ఆది స్పష్టం చేశారు. అందుకే.. శివాజీ రాజా.. తన మాటలను వెనక్కి తీసుకోవాలని ఆది డిమాండ్ చేశారు.

చిరంజీవి అంటే నాకు ఇష్టం అని చెప్పి నాగబాబును తిడితే ఆయనకు నచ్చుతుందా? పవన్ కల్యాణ్ అంటే ప్రాణం అని చెప్పి ఆయన పార్టీ తరుపున పోటీ చేస్తున్న నాగబాబుకు ఓటేయొద్దని చెబితే అది పవన్ కల్యాణ్‌కు నచ్చుతుందా? చిరంజీవి, పవన్‌ను పొగిడి.. నాగబాబును తిడితే మెగాఫ్యాన్స్‌కు నచ్చుతుందా? ఇవన్నీ ఆలోచించకుండా.. అలా ఎలా మాట్లాడుతారు.. అంటూ ఆది ఫైర్ అయ్యారు.

నీది నరసాపురం అన్నావు కదా.. వచ్చి నరసాపురం సెంటర్‌లో నిలబడు..

మీరు ఇంకోమాట కూడా చెప్పారు. మీది నరసాపురం అని అన్నారు కదా. ఒకసారి నరసాపురం వచ్చి చూడండి. నరసాపురం సెంటర్‌లో నిలబడండి. మీతో పాటు నాగబాబు కూడా వచ్చి అక్కడ నిలబడతారు. ఎవర్ని తరిమికొడతారో చూడొచ్చు.. అంటూ ఆది మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news