Allu Arjun Birthday: అల్లు అర్జున్‌ “ఐకాన్‌”.. కనుబడుట లేదు.

-

అల్లు అర్జున్‌ దిల్‌ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. బర్త్‌డే బాయ్‌ అల్లు అర్జున్‌కి పుట్టిన రోజు విషేశ్‌ చెబుతూ నిర్మాత దిల్‌ రాజు కొత్త సినిమాను ప్రకటించాడు. సినిమా పేరు “ఐకాన్‌”.. క్యాప్షన్‌ “కనుబడుట లేదు”.. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్న ఈ చిత్ర టైటిల్ ఆసక్తిరేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి ఎమ్‌సీఏ ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వం చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, పరుగు సూపర్‌ హిట్‌ కాగా డీజే నిరాశ పరిచింది. ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నట్టు తెలుస్తుంది. వేణు శ్రీరామ్ బన్నీకి పర్ఫెక్టుగా సెట్టయ్యే కథ తయారు చేయడంతో దిల్ రాజు వెంటనే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ చేశారట. కథ విన్నవెంటనే హిట్‌ పక్కా అనే నమ్మకం కలిగిందట.. బన్నీకి సరిపోయే కథ రాసినందుకు ఖరీదైన కారును కూడా దర్శకుడికి గిఫ్టుగా ఇచ్చాడట దిల్‌ రాజు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మించనున్నాడు.

అల్లు అర్జున్‌ ఇప్పటికే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సుకుమార్‌లతో సినిమా చేయాల్సి ఉంది. కాగా త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ, అల్లు అర్జున్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే ఐకాన్‌ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
మిగితా నటీనటులని, హీరోయిన్‌ ఎంపిక చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news