పాకిస్థాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించిన తర్వాత ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆయనను విశ్రాంతి తీసుకోవాలంటూ అధికారులు వెల్లడించారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ చర్చల్లోకి వచ్చారు. ఆయన ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఆయన దేశ ప్రజల గుండెల్లో హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఓ నిర్ణయం దేశ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.
పాకిస్థాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించిన తర్వాత ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆయనను విశ్రాంతి తీసుకోవాలంటూ అధికారులు వెల్లడించారు. ఇంటికి వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్లీ డ్యూటీలో జాయిన్ అవ్వాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పినా.. తనకు రెస్ట్ అవసరం లేదని చెప్పి వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యారట అభినందన్.ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో దాదాపు రెండు వారాల పాటు అభినందన్ కు చికిత్స చేశారు. ఆ తర్వాత 4 వారాల పాటు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. కానీ.. ఆయన మాత్రం ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. తను డ్యూటీలో జాయిన్ అయినప్పటికీ.. ప్రస్తుతానికి ఆయనకు విమానాలు నడిపేందుకు అనుమతి లేదు. నెల తర్వాత మళ్లీ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఫిట్ గా ఉంటేనే విమానాలు నడిపేందుకు అనుమతిస్తారు.
సాధారణంగా త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవులు చాలా తక్కువగా దొరుకుతాయి. తమ ఫ్యామిలీతో గడిపే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సంవత్సరాల తర్వాత ఎప్పుడో కానీ లీవ్ దొరకదు. అలాంటిది అభినందన్ కు నెల రోజుల లీవ్ ను అధికారులు కల్పించినా.. తాను వెళ్లనని.. తన టీంతోనే ఉంటానని చెప్పిన అభినందన్ దేశభక్తిని చూసి దేశ ప్రజలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. హేట్సాఫ్ అభినందన్. నువ్వు నిజమైన హీరోవు. నువ్వు నిజమైన దేశభక్తుడివి. దేశం నిన్ను చూసి గర్విస్తోంది.