సమంత నువ్వు సూపర్ అంతే.. వెంకటేష్ కూతురు పెళ్లిలో బలప్రదర్శనలో నెగ్గిన సామ్..! (వీడియో)

-

విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత, వినాయక్ రెడ్డిల మ్యారేజ్ జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో దగ్గుబాటి ఫ్యామిలీ చేసిన హంగామా ఫోటోల రూపంలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ పెళ్లిలో అక్కినేని కోడలు ఆర్మ్ రెజ్లింగ్ అదేనండి కుస్తీ పట్టులో తనతో పోటీ పడిన ఓ మహిళను ఓడించింది. అసలే జిమ్ వర్క్ అవుట్స్ చేసి ఎప్పుడు ఫిట్ గా ఉండే సమంత ఇలాంటి టైంలో తన బల ప్రదర్శనతో అదరగొట్టింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్, రానా, నాగ చైతన్య అందరి సమక్షంలో సమంత కుస్తీ పట్టులో విజయం సాధించింది. జైపూర్ లో జరిగిన వినాయక్, అశ్రితల మ్యారేజ్ కు కొద్దిమంది అతిథులు మాత్రమే అటెండ్ అయ్యారు. త్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ రిసెప్షన్ కు సిని రాజకీయ రంగాలకు సంబందించిన ప్రముఖులందరిని ఆహ్వానిస్తారని తెలుస్తుంది.


Read more RELATED
Recommended to you

Latest news