హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ టికెట్స్.. 10 నిమిషాల్లో 1000 టికెట్స్..!

-

శుక్రవారం రిలీజ్ అవబోతున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోయింది. నిత్యం ఏదో ఒక గొడవతో వార్తల్లో ఉంటూ వస్తున్న ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆన్ లైన్ లో టికెట్స్ పెట్టడమే ఆలస్యం ఒక థియేటర్ లో 10 నిమిషాల్లో 1000 టికెట్స్ సేల్ అవడం జరిగిందట. ఆర్జివి తీసిన ఈమధ్య సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.

అయితే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మాత్రం కచ్చితంగా మరోసారి వర్మ సత్తా చాటేలా చేస్తుందని అంటున్నారు. ఇక ఈ టికెట్స్ బుకింగ్స్ చూసి వర్మ ఓ ట్వీట్ కూడా చేశాడు. ఈ టికెట్స్ అమ్ముడవడం చూస్తుంటే ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ చూడాలనుకునే ప్రజలు ఎగబడుతున్నారని మెసేక్ పెట్టాడు. ఇది నిజంగా నిజమే గెలిచిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చివర్లో జై బాలయ్య అని పెట్టి పుండు మీద కారం చల్లుతున్నాడు ఆర్జివి.

Read more RELATED
Recommended to you

Latest news