హిందువులు చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని అనకూడదా..?

-

సాధారణంగా ఎవరైనా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని అంటారు. పైగా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు రెస్ట్ ఇన్ పీస్ అని మెసేజ్ పెడుతూ ఉంటారు. అయితే రెస్ట్ ఇన్ పీస్ అని హిందువులకి అనకూడదా అని చాలా మంది అంటూ ఉంటారు కదా..? అయితే నిజానికి హిందూ ధర్మం ప్రకారం రెస్ట్ ఇన్ పీస్ అనకూడదు.

 

దీనికి గల కారణం ఏమిటంటే చనిపోయిన వాళ్ళని క్రిస్టియన్లు పాతి పెడతారు. పైగా వాళ్ళకి తీర్పు వచ్చే రోజు ఒకటి ఉందని నమ్ముతారు. ఆ తరువాత స్వర్గానికి వెళ్తారా లేదా అనేది నిర్ణయిస్తారు. తీర్పు వచ్చే వరకు ఆత్మ సమాధి లో ఉంటుంది. అందుకని వాళ్లు మళ్లీ లేస్తారని అప్పటి వరకు ప్రశాంతంగా ఉండాలని రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు.

కానీ హిందూ ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే చనిపోయిన వారు మళ్ళీ తిరిగి లేవరు. మనిషికి పునర్జన్మ ఉంటుంది అని నమ్ముతారు. హిందువులు అందుకే మరణించిన వ్యక్తికి కర్మల ఫలితంగా మరో జన్మ ప్రాప్తిస్తుందని విశ్వాసం. ఆత్మకు విశ్రాంతి లేదో మోక్షం మాత్రమే అందుకని హిందువులకి రెస్ట్ ఇన్ పీస్ అని వాడకూడదు. ఓం శాంతి, ఓం సద్గతి వంటివి మాత్రమే పెట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news