ఇంట్లోకి గ్రీనరీతో డెకరేషన్ చేయడం ఎంత ముఖ్యమో…అది నాచురల్గా కనిపించేలా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం..ఇండోర్ ప్లాంట్స్ తెచ్చి ఇంట్లో అక్కడక్కడ పెట్టినంతమాత్రమా..ఇళ్లు గ్రీనరీగా అందంగా మారిపోదు..సహజత్వం ఉట్టిపడే అలంకరణ ఉండాలి. సింపుల్ గా ఇళ్లు అందంగా ఉండాలంటే..రాతి కళ చాలా గొప్పది. పెద్దరాతి నమూనాను గోడగా అమర్చినా, చిన్న చిన్న రాళ్లను ఫ్రేములుగా కట్టినా.. ఆ కళ వెంటనే చూపరులను ఆకట్టుకుంటుంది. సూపర్ ఉంటుంది.
గోడంత రాయి: లగ్జరీకి ప్రతిరూపం.. చూపు తిప్పుకోనివ్వని అందం వాల్ స్టోన్‌ది. పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల్లో అతి పెద్ద రాయిని గోడకు బదులుగా నిర్మించడంలో వారి అభిరుచి తెలిసిపోతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన వాల్ డిజైన్లలో కొన్నేళ్లుగా వాల్‌స్టోన్ ప్రత్యేకంగానే నిలుస్తోంది. ఒకవేళ అంత పెద్ద స్టోన్‌ని అమర్చలేం అనుకున్నవారు కాంక్రీట్‌తో గోడ మొత్తం స్టోన్ లుక్‌తో మెరిపిస్తున్నారు. సహజత్వాన్ని ఇంటి అలంకరణలో భాగం చేయడానికి ఖరీదు అనేది పెద్ద పట్టింపుగా ఉండటం లేదు.
గోరంత దీపం: గొడుగులా ఉండే టేబుల్ ల్యాంప్.. ఇంటికెంత అవసరమో మనకు తెలిసిందే. ఈ టేబుల్ ల్యాంప్ సహజత్వంతో వెలుగులు రువ్వాలంటే రాళ్లతో ఇలా సృష్టించుకోవచ్చు.
ఆకర్షణ రాళ్లు: రాళ్లపై అక్షరాలు గార్డెన్‌లోనే కాదు లివింగ్ రూమ్‌లోనూ అందంగా నిలుస్తాయి. రోజులో మనకు కావల్సిన సందేశాన్ని మనమే సృష్టించుకోవచ్చు. కుటుంబ సభ్యుల పేర్లనూ కూడా రాసి అలంకరించుకోవచ్చు.
టేబుల్ టాప్: నదీ తీరాలను సందర్శించే వారు కొందరు తమకు నచ్చిన రాళ్లను జ్ఞాపకంగా వెంట తెచ్చుకుంటారు. సెంట్రల్ టేబుల్ టాప్‌ను గ్లాస్ అమరికతో డిజైన్ చేయించుకోవాలనుకునేవారు ఇలా జ్ఞాపకాల రాళ్లను కూడా పొందిగ్గా వాడుకోవచ్చు.
ప్లేట్ మ్యాట్స్: ఇప్పటి వరకు క్లాత్, జ్యూట్, ఫైబర్ వంటి ప్లేట్ మ్యాట్స్‌ను డైనింగ్ టేబుల్‌పైన అలంకరించి ఉంటారు. ఇప్పుడు ఈ స్టోన్ మ్యాట్స్‌ను ప్రయత్నించండి. మీ సృజనాత్మకతకు అతిథుల ప్రశంసలు తప్పక అందుతాయి.
ఫొటో ఫ్రేమ్స్, స్టోన్ పెయింటింగ్, వాల్ డెకార్ హ్యాంగింగ్స్, ఫ్లవర్ పాట్స్.. ఇలా చిన్న చిన్న రాళ్లతో అందమైన కళాకృతులను ఆకర్షణీయంగా ఎవరికి వారు రూపొందించు కోవచ్చు. ఇందుకు కావల్సినవి కొన్ని రాళ్లు, మరికొంత గమ్. ఇంకొన్ని రంగులు. ఆర్ట్ మీ చేతిలో ఉంటే చక్కటి రాళ్లు మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి.
సొంతిళ్లు కట్టుకునే వారు..ఓ సారి వీటిని ట్రై చేయండి..!