ఒక్క రూపాయి దానం చేస్తే రూ. 12, 500 పన్ను మినహాయింపు పొందవచ్చు తెలుసా..?

-

ఆదాయం పెరిగే కొద్ది ఖర్చులు ఎలాగూ పెరుగుతాయి.. కానీ పన్ను కట్టాల్సిన బాధ్యత కూడా పెరిగితినే మనకు భారంగా అనిపిస్తుంది. ఎలాగోలా పన్నును నుంచి మినాహాయింపు పొందడానికి ఏం ఏం మార్గాలు ఉన్నాయి అని ఆలోచిస్తాం. లక్షల్లో శాలరీలు వచ్చే వాళ్లు కూడా ఇలానే ఆలోచిస్తారు. ఒక్క రూపాయి దానం చేస్తే 12, 500 ఆదా చేసుకోవచ్చంటే మీరు నమ్మగలరా..? కానీ ఇది నిజం. పన్ను ఆదా కోసం ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతో పాటుగా ఇంకా పన్ను ఎలా ఆదా చేయొచ్చనే అంశాలను తెలుసుకొని ఉండాలి. అప్పుడే ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద మీరు డబ్బులు విరాళం చేయడం ద్వారా కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. కేవలం ఒక్క రూపాయి దానం చేస్తే ఏకంగా రూ. 12,500 వరకు పన్ను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ లేదు. అలాగే ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ. 5 లక్షల వరకు ఉన్నా కూడా పన్ను పడదు. రిబేట్ లభిస్తుంది. రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రూ. 12,500 వరకు రిబేట్ లభిస్తుంది. సెక్షన్ 87 కింద ఈ బెనిఫిట్ ఉంది. అంటే రూ. 5 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ ఉండదు. అదే మీ ఆధాయం రూ. 1 పెరిగినా కూడా అప్పుడు మీకు సెక్షన్ 87 కింద రిబేట్ రాదు. మీకు 5 శాతం ట్యాక్స్ అంటే రూ. 12,500 వరకు పన్ను పడుతుంది. ఈ సందర్భంలో మీరు రూ.1 దానం చేస్తే.. మీకు సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఇక్కడ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్‌కు మాత్రమే దానం చేయాలి.

మీ ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ. 5.1 లక్షల వరకు ఉన్నా కూడా, మీరు రూ. 10 వేలు చారిటీకి ఇస్తే మీకు కచ్చితంగా బెనిఫిట్ లభిస్తుంది. చారిటీ వల్ల మీ ఆదాయం రూ. 5 లక్షల వరకే ఉంటుంది. అప్పుడు సెక్షన్ 87ఏ కింద రిబేట్ పొందొచ్చు. రూ. 12,500 వరకు లభిస్తాయి. మీ వద్ద డొనేషన్ చేసిన రశీదు కచ్చితంగా ఉండాలి. లేదంటే ఈ బెనిఫిట్‌ను పొందలేరు. అలాగే మీరు ఏ ఆర్థిక సంవత్సరానికి అయితే ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారో అదే ఆర్థిక సంవత్సరంలోనే డొనేషన్ చేసి ఉండాలండోయ్..!

Read more RELATED
Recommended to you

Latest news