మీ శరీరంలో ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉన్నాయా.. అయితే అ‌వి అదృష్టమా లేక దురదృష్టమా తెలుసుకోండి..!

-

మనకు పుట్టుకతోవచ్చే పుట్టుమచ్చల వల్ల కొంత అదృష్టం, మరికొంత దురదృష్టం రెండూ ఉంటాయి. అవి ఉండే ప్రదేశాలను బట్టి ఇది ఆధారపడుతుంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కొంతమందికి వీటిని నమ్మటం అస్సలు ఇష్టం ఉండదు. నమ్మినా లేకున్నా తెలుసుకోవటం మాత్రం ఆసక్తిగా ఉంటుంది కదా. సరే నమ్మకపోతేలే.కనీసం మీకు ఈ ప్రదేశాల్లో ఒక్కటైనా పుట్టుమచ్చ ఉందో లేదో తెలుసుకోండి టైం పాస్ కైనా. జ్యోతిష శాస్త్ర నిపుణులు మాత్రం…శరీరంలో వివిధ భాగాల్లో పుట్టు మచ్చల వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే… మగవారికీ, ఆడవారికీ పుట్టుమచ్చల విషయంలో చాలా తేడాలు ఉంటాయట. ఏ పుట్టుమచ్చ వల్ల అదృష్టమో, దేని వల్ల దురదృష్టమో ఇప్పుడు చూద్దాం.

mole on right shoulder

మగవారకి తమ కుడివైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు కలిగివుంటే అదృష్టమని పండితులు అంటున్నారు. అదే మహిళలకైతే..ఎడమవైపు శరీరంపై పుట్టుమచ్చలు కలిగివుంటే మేలు అంటున్నారు.

ఓ వ్యక్తి శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది చెడు సంకేతాలకు గుర్తు అని చెబుతున్నారు. వారి జీవితంలో ఆనందం, మనస్శాంతి ఉండవట. ఓ సారి మీరు లెక్కేసుకోండి అసలు ఎన్ని ఉన్నాయో.

కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట. అదే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో మనస్పర్థలు, గొడవలు పెరిగి విడిపోయో ప్రమాదం ఉండొచ్చు అంటున్నారు. అయితే ఇలా కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉన్నవారు… ప్రయాణాలు బాగా చేస్తారట.

mole-on-face

ముఖం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే అది ప్రేమకు గుర్తు. అదే మోల్ ముఖంపై కుడివైపు ఉంటే ఆ వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్టుపై విపరీతమైన నాలెడ్జిని పొందగలరు. అదే మోల్ ముఖంపై ఎడమవైపు ఉంటే వారు డబ్బును వృథాగా ఖర్చు చేస్తారు.

ముఖంపై కుడివైపు ఉండే పుట్టుమచ్చ సంపద, తెలివితేటలకు గుర్తట. అదే ముఖంపై ఎడమవైపు ఉండే పుట్టుమచ్చ నిరాశకు గుర్తు. జీవితం ఆనందంగా ఉండదని పండితులు చెబుతున్నారు.

కళ్లలో పుట్టుమచ్చ ఉన్నవారు బాగా ఆలోచించగలరట. కుడివైపు కంటిలో ఉంటే వాళ్లు క్రియేటివ్‌గా ఆలోచిస్తారట. ఇతరుల్ని అంచనా వేయడంలో వారికి తిరుగుండదు.

కళ్లలోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్‌గా ఉంటారు. చిన్న చిన్న విషయాలపైనా లోతుగా స్పందిస్తారు. చెవిలో పుట్టుమచ్చ ఉంటే… ఎక్కువ కాలం జీవిస్తారని అంటారు.. ముఖం చుట్టుపక్కల పుట్టు మచ్చ ఉంటే వారు ఆనందంగా ఉంటారు. మర్యాదస్తులలా ఉంటారు.

నోట్లో పుట్టుమచ్చ ఉంటే సంపన్నులవుతారు. అదృష్టం మామూలుగా ఉండదు. ఆ వ్యక్తిని చేసుకునే మహిళ బాగా ఆనందంగా ఉంటుందట.

ముక్కులో, ముక్కుపైన ఉంటే ఆ వ్యక్తి చాలా టాలెంట్ కలిగి ఉంటారు. ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో అదృష్టవంతులవుతారు.

Mole On Lips

పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది. వారిలో లైంగిక కోరికలు చాలా బలంగా ఉంటాయట. అదే పుట్టుమచ్చ కింది పెదవిపై ఉంటే వారి జీవితంలో పేదరికం ఉంటుంది.

ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే నిరాశతో ఉంటారు. కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే సంపన్నులు అవుతారట.

కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి నిబద్ధత కలిగి ఉంటారు. ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు కొద్దిగా కోపంగా ఉంటారట.

చేతులపై పుట్టుమచ్చలు ఉండేవారు తెలివైన వారు. కుడి చేతిపై పుట్టుమచ్చ ఉంటే వారు చాలా బలవంతులు అవుతారు. కుడివైపు వెనకవైపున పుట్టుమచ్చ ఉంటే సంపన్నులు అవుతారు.

ఎడమ చేతికి పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా డబ్బు ఖర్చు పెడతారని అంటారు.. అదే పుట్టుమచ్చ ఎడమ చేతి వెనకవైపు ఉంటే ఆ వ్యక్తికి జాలి, దయ అంతగా ఉండవట.

ఇది సంగతి..ఈ ప్రదేశాల్లో ఉన్నవాళ్లు కచ్చితంగా ఇలానే ఉండాలని లేదు. జ్యోతిష్యశాస్ర్తం ఇలా చెబుతుందని మేము వాటిని ఆధారంగా చేసుకుని ఈ కథనం అందించా అంతే..మీ ఆత్మీయులలో ఎవరికైనా లక్కీ ప్లేస్ ఉంటే ఈ ఆర్టికల్ షేర్ చేయండి. టైం పాస్ కి, మీకు అవగాహన కోసం మాత్రమే ఇది రాయబడింది. మనలోకం కన్ఫామ్ చేసి చెప్పింది కాదు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news