జీవితంలో అనుకున్నది సాధించాలంటే వీటిపై దృష్టి పెట్టండి..!

జీవితం అంటే కష్టం సుఖం ఉంటుంది. ఓసారి కష్టాలు వస్తే మరో సారి ఆనందం ఉంటుంది. కానీ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ప్రతీ ఒక్కరు జీవితం లో ఎదగాలి… వారి గమ్యాన్ని రీచ్ అవ్వాలి. ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల కూడా గమ్యాన్ని రీచ్ అవ్వలేము. కనుక ఏ పొరపాట్లు లేకుండా చూసుకోవడం అవసరం. ఇది ఇలా ఉంటే చేసే ప్రతీ పనిని కూడా జీవితం లో గౌరవించాలి. అలా చేస్తేనే ఎదుగుదల ఉంటుంది గుర్తుంచుకోండి.

మన గురించి మనకి అవగాహన ఉందా అని ముందుగా ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకుంటే మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా లేదా అనేది తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఎక్కువగా చాలా మంది చేసే పోరపాటు ఏమిటో కూడా చూసేయండి….

1. అతిగా ఆలోచిస్తూ చాలా మంది భవిష్యత్ ‌పై ఎక్కువగా ఆలోచించి వర్తమానంలో విఫలమవుతుంటాడు.

2. సోషల్ మీడియాలో అతిగా గడపడం చాలా మంది చేసే తప్పే. అనవసరం సమయం దీని వల్ల వృధా అవుతుంది. అలానే సోషల్ మీడియా ప్రపంచం వాస్తవా జీవితానికి భిన్నంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి.

3 . ప్రతిభకు తగ్గట్టుగా ఆ గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి. అంతే కానీ ఇతరులతో మీమ్మల్ని మీరు పోల్చుకొకండి. మీరు చేయగలిగేది… మీకు శక్తాసక్తులు ఉండే వాటినే ఎంచుకోండి.

4. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసగా మారిపోయారు చాలా మంది. దీని మూలంగా గమ్యాన్ని మరచి త్రోవ మరచిపోతున్నారు. కనుక దృష్టి గమ్యం వైపు ఉండడమే మంచిది.

5. అలానే చూట్టూ ఉన్న సమాజాన్ని కూడా అతిగా నమ్మడం మానేయాలి. మనిషి అంతర్గతం,పైకి కనిపించేది వేరు అని గుర్తించాలి.