ఆగిపోయిన ‘క్రాక్’ సినిమా షోలు.. అదే కారణం !

మాస్ మ‌మహరాజా ర‌వితేజ‌ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌ లో తెరకెక్కిన తాజా చిత్రం “క్రాక్‌”. డాన్‌ శీను, బ‌లుపు వంటి కమర్షియల్ హిట్ సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఈ ఇద్దరూ. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ ఈ సినిమా హిట్ తప్పనిసరి దీంతో ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. దానికి ఫైనాన్స్ ఇష్యూలే కారణం అని అంటున్నారు. చిత్ర నిర్మాతలు, ఫైనాన్షియర్స్ మధ్య ఉన్న ఫైనాన్స్ ఇష్యూల కారణంగా ఈ సినిమా విడుదల ఆపాలని  ఫైనాన్షియర్స్ కోర్టుకు వెళ్ళారని అంటున్నారు. అయితే ఈ అంశాలు కొద్దిసేపటికి క్లియర్ అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?