రోడ్లపై ఉమ్మేసే ముందు ఓసారి ఆలోచించండి.. లేదంటే అడ్డంగా బుక్కవుతారు..!

-

మన ఇంట్లో ఉమ్మేస్తామా? అస్సలు వేయం. ఎందుకు అంటే అది మన ఇల్లు కాబట్టి. అది శుభ్రంగా ఉండాలి కాబట్టి.. కానీ.. రోడ్డు మీద అయితే.. తుపక్.. తుపక్ అని ఊంచేస్తాం. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం. రోడ్డు లేదు గీడ్డు లేదు కాండ్రించి ఉమ్మేయడమే. దాని వల్ల మనం ఎంత తప్పు చేస్తున్నామనేది మనకు తెలియదు. అందుకే.. మహారాష్ట్రలోని పూణె కార్పొరేషన్ అధికారులు వినూత్నమైన ఆలోచన చేశారు.

పూణె రోడ్లపై ఉమ్మేసేవాళ్లను పట్టుకొని వాళ్లతోనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నారు. ఇదివరకు ఉమ్మివేయడంపై పూణె ప్రజలకు ఎన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేదట. అందుకే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు అధికారులు. జరిమానాతో పాటు వాళ్లు ఉమ్మేసిన ప్రాంతాన్ని కూడా క్లీన్ చేయిస్తే.. ఇక వాళ్లు జన్మలో కూడా రోడ్ల మీద మళ్లీ వాళ్లు ఉమ్మి వేయడానికి వంద సార్లు ఆలోచిస్తారని అధికారులు చెబుతున్నారు. చెప్పడమే కాదు.. ఇప్పటి వరకు మొత్తం 156 మందిని పట్టుకొని వాళ్లతోనే ఆ ప్రాంతాలను శుభ్రం చేయించారట. దాంతో పాటు ఒక్కొక్కరికి 150 రూపాయల జరిమానా కూడా విధించారట. 2018 లో శుభ్రత సర్వేలో పూణె పదో స్థానంలో నిలిచిందట. వచ్చే సంవత్సరం శుభ్రత సర్వేలో పూణె మొదటి స్థానంలో నిలిచేలా చేసేందుకే ఇటువంటి కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నదట పూణె కార్పొరేషన్. వావ్.. ఈ ఐడియా ఏదో బాగున్నట్టున్నదే. ఈ ఐడియాను దేశమంతా అమలు చేస్తే దేశం ఎంత క్లీన్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version