ఆ దేశంలో మన భేల్‌పూరీ అంటే పడి చచ్చి పోతారట..ఎందుకో తెలుసా?

-

భేల్‌పూరీ..ఈ పేరు వినగానే అందరికీ నోరు ఊరుతుంది కదూ..అవును నిజమే..దాని రుచి అలాంటిది మరి..చూడటానికి కలర్ ఫుల్ గా ఉంటుంది.. అందుకే చిన్నా, పెద్దా అందరూ లైక్ చేస్తున్నారు..ఈ స్నాక్ మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో ఫ్యాన్స్ ఉన్నారు..మరమరాలు, సేవ్‌, పచ్చి ఉల్లిపాయ, టమాట ముక్కలు, నోరూరించే చాట్‌ మసాలా, ఉప్పు, కారంతోపాటు ఫైనల్‌ టచ్‌గా జోడించే నిమ్మరసం, కొత్తిమీర తురుముతో కనిపించే కలర్ ఫుల్ స్నాక్ ప్రత్యేకత ఉంది.

సాయంకాలం కాగానే వీధుల్లో భేల్‌పూరీ బండ్లే కనిపిస్తాయి. అన్నట్టు, మన భేల్‌పూరీ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న ఓ వంటల పోటీ కార్యక్రమంలో సారా టాడ్‌..అనే చెఫ్ పది నిమిషాల చాలెంజ్‌లో భాగంగా మంటతో పనిలేని మన భేల్‌పూరీని తయారుచేసి జడ్జీలకు వడ్డించింది. భేల్‌పూరీ రుచికి జడ్జీలు పడిపోయారంతే.. అది తయారు చేసిన షెఫ్‌ను తెగ మెచ్చుకున్నారు.

ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలను ప్రత్యాశ రథ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా రీట్వీట్లు, కామెంట్లు, లైకులతో ఓ రేంజ్‌లో వైరల్‌ అయింది. అంతేకాదు చాలామంది సారాకు ఫోన్‌ చేసి మరీ మెచ్చుకున్నారట. కొందరు నెటిజన్లు ఆస్ట్రేలియాలో ఇండియన్‌ రెస్టారెంట్లు, చాట్‌ సెంటర్ల లొకేషన్లు షేర్‌ చేసి ఓసారి రుచి చూడమని చెబుతుండటం విశేషం..దక్షిణాది జనాల రుచికి తగ్గట్లు భలే ఉంటుంది. అందుకే ఇది ఇక్కడా,అక్కడా అని కాకుండా బాగా ఫెమస్ అయ్యింది.ఎంత మన ఇండియన్ ఫుడ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా..

Read more RELATED
Recommended to you

Latest news