New Year: నూతన సంవత్సరాన్ని మొదట ఏ దేశంలో జరుపుకుంటారు

-

డిసెంబర్ అంటేనే ఫెస్టివల్‌ మంథ్.. ఒకదాని తర్వాత మరొకటి పండుగ వస్తూనే ఉంటుంది. ఈ సమయంలో అందరూ పిక్నిక్‌లు, పార్టీలు లేదా గెట్ టుగెదర్‌ల వంటి ఈవెంట్‌లు ప్లాన్‌ చేసుకుంటారు. చలికాలం అంతా వివిధ పండుగలు జరుపుకుంటారు. ఇక నెలాఖరికి వచ్చే న్యూయర్‌ కోసం అయితే ఇప్పటి నుంచే రెడీగా ఉంటారు. సంవత్సరం చివరి రోజును ఎలా జరుపుకోవాలో ఒక నెల మొత్తం ప్లాన్ చేస్తారు. వివిధ దేశాల్లో కొత్త సంవత్సరాన్ని వేర్వేరు సమయాల్లో జరుపుకుంటారని మీకు తెలుసా? భూమి ఆకారాన్ని బట్టి సూర్యోదయ సమయం భిన్నంగా ఉంటుంది. అందుకే రోజు వివిధ సమయాల్లో ప్రారంభమవుతుంది,ముగుస్తుంది. ఈ కారణంగా, కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సమయం కూడా భిన్నంగా ఉంటుంది.  ఏ దేశంలో మొదట న్యూయర్‌ స్టాట్‌ అవుతుంది.. ఏ టైమ్‌కు సెలబ్రేట్‌ చేసుకుంటారో చూద్దామా..!
పసిఫిక్ దీవులైన టోంగా, కిరిబాటి, సమోవాలో మొదట నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ చివరి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
ఆస్ట్రేలియాలో డిసెంబర్ 31న సాయంత్రం 6.30 గంటలకు కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి.
జపాన్, ఉత్తర మరియు దక్షిణ కొరియాలలో రాత్రి 8.30 గంటలకు సెలబ్రేషన్స్‌ స్టాట్‌ అవుతాయి.
చైనా, ఫిలిప్పీన్స్, సింగపూర్‌లో 9.30 ISTకి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. భారత కాలమానం ప్రకారం 11.30 గంటలకు ఆ దేశంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
చివరగా, న్యూ ఇయర్ పండుగను భారతదేశం మరియు శ్రీలంకలో జరుపుకుంటారు. ఈ రెండు దేశాల్లో డిసెంబర్ 31 రాత్రి సరిగ్గా 12 గంటలకు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
మొత్తానికి ఇప్పుడు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మీరు న్యూయర్‌కి ఏం ప్లాన్స్‌ వేసుకున్నారు. పైగా డిసెంబర్‌ 31 ఆదివారం వచ్చింది కాబట్టి ఇక రచ్చ మాములుగా ఉండదు..!

Read more RELATED
Recommended to you

Latest news