గ్యాంగ్ లీడర్ ఈ పేరు వినగానే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గుర్తుకు రావడం కామన్. అయితే ఇదే టైటిల్ తో నాచురల్ స్టార్ నాని ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విషయమై నానిపై మెగా ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ కూడా అందరికి తెలిసిందే. ఇదిలాఉంటే అసలు విక్రం కుమార్ గ్యాంగ్ లీడర్ చేద్దామని అనుకుంది నానిని కాదట.
సూపర్ స్టార్ మహేష్ తో విక్రం కుమార్ సినిమా తీయాలని అనుకున్నాడు. ఈ సినిమాను అశ్నివదత్ నిర్మించాల్సి ఉంది. అయితే విక్రం కుమార్ చెప్పిన కథ.. గ్యాంగ్ లీడర్ టైటిల్ మహేష్ కు నచ్చలేదట. అందుకే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అలా మహేష్ కాదన్న సబ్జెక్ట్ ను నానికి చెప్పి ఒప్పించుకున్నాడు. ఒకవేళ మహేష్ బాబే ఆ సినిమా ఒప్పుకుని ఉంటే మహేష్ నయా గ్యాంగ్ లీడర్ అయ్యేవాడు. ఏది ఏమైనా మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం రైట్ ఆర్ రాంగ్ అన్నది గ్యాంగ్ లీడర్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది.