స్ఫూర్తి: పుట్టింది నెల్లూరు కట్ చేస్తే ఆస్ట్రేలియాలో చాయ్‌వాలా…కోట్లు సంపాదన..ఇది కదా సక్సెస్ అంటే..?

-

అనుకున్నది సాధించడం అంత ఈజీ కాదు. అలా అని పెద్ద కష్టమేమీ కాదు. చాలామంది లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే ఫెయిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఫెయిల్ అవ్వచ్చేమో అన్న భయం వద్దు. సక్సెస్ అయిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళితే కచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది.

 

పుట్టింది నెల్లూరు జిల్లాలో అయినా ఆస్ట్రేలియాలో ఛాయ్ వాలాగా స్థిరపడ్డారు ఓ యువకుడు ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నారు. ఇక మరి దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్లి పోదాం. చాలా మంది లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. సంజిత్ కొండ కూడా లైఫ్ లో సెట్ అవ్వడానికి టైం పట్టింది.

ఆస్ట్రేలియాలో ఇతను లాట్రోబ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చేస్తున్నప్పుడు ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ రాలేదు దాని మూలంగా చదువుతున్న కోర్స్ ని కంప్లీట్ చేయలేకపోయారు. ఈయన వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. తన ఆసక్తిని వ్యాపారంపై చూపించారు.

మెల్బోర్న్ లో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశారు ఎలిజిబెత్ వీధిలో డ్రాప్ అవుట్ చాయ్ వాలా అని టీ కొట్టు ని ఓపెన్ చేశారు. వ్యాపారంలో తను ఎలా నిలబడాలి..? వ్యాపారాన్ని ఎలా విస్తరించుకోవాలి అనే వాటి మీద ఫోకస్ చేశారు. ఇండియన్ కస్టమర్లకి టేస్ట్ కి తగ్గట్టుగా ఛాయ్ సమోసా కాఫీ ఇవన్నీ తయారుచేసి అమ్ముతూ ఉంటారు.

మసాలా టీ, అల్లం టీ, గ్రీన్ టీ వంటి వాటిని అక్కడ చేసి ఫేమస్ అయిపోయారు. మంచి క్వాలిటీని మెయింటెన్ చేస్తూ వ్యాపారిని విస్తరించుకుంటున్నారు ఇలా అనుకోకుండా చాయ్ వాలా కింద సక్సెస్ అయ్యారు. ఏడాది కాలంలోనే డ్రాప్ అవుట్ చాయ్ వాలా షాప్ మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగిపోయింది. ఇప్పుడు ఫ్రాంఛైజ్లని కూడా ఓపెన్ చేసి టీ కొట్టు ని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు.

చదువుకోవడంలో విఫలమైనా జీవితంలో విఫలం అవ్వను అని ప్రూఫ్ చేసుకున్నారు. 5 .2 కోట్ల రూపాయలకు టర్నోవర్ గా ఈ టీ షాప్ ఇప్పుడు అభివృద్ధి చెందింది. తను ఏంటో ఇలా ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా జీవితంలో ఒక ఫెయిల్యూర్ వచ్చిందని దానినే చూసుకుంటూ పోతే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము.

Read more RELATED
Recommended to you

Latest news