అమెరికా గురించి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్.. ఏటా భార్యల చేతిలో ఇంత మంది భర్తలు దాడులు ఎదుర్కొంటున్నారా..!

-

అమెరికా.. లైఫ్ లో ఒక్కసారైనా అందరూ వెళ్లాలనుకునే అందమైన ప్రదేశం. చదువుకోసం, ఉద్యోగం కోసం.. మన దేశం నుంచోకక ఏటా ఎంతోమంది అమెరికాకు వెళ్తున్నారు. 50 రాష్ట్రాలు కలిసి ఒకటే దేశంగా ఏర్పడిని అద్భుతమే అమెరికా..నేడు ఈ దేశంలో 33 కోట్ల మంది పైగా ప్రజలు జీవిస్తున్నారు. ప్రపంచంలో అధిక జనాభా ఉన్న చైనా, భారత్ తర్వాత స్థానం అమెరికాదే.. ఈరోజు మనం అమెరికా గురించి ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ చూద్దాం..

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ అయినప్పటికీ… పాపులర్ సిటీగా, ఫైనాన్షియల్ సెంటర్‌గా న్యూయార్క్ నిలుస్తోంది.

అమెరికాలో మత్తుపదార్థాలు, మద్యం కంటే పొగాకు వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. కానీ స్మోకింగ్‌కు అక్కడ చట్టపరమైన అనుమతి కూడా ఉంది.

అమెరికాలో దాదాపు 60 శాతం మంది టీనేజ్ అమ్మాయిలు తాము అధికబరువు ఉన్నామని అనుకుంటారు. నిజానికి 20 శాతం లోపే అధికబరువు ఉన్నారు.

ప్రతి అమెరికన్ రోజూ సగటున 16,000 అడ్వర్టైజ్‌మెంట్లు, లోగోలు, లేబుల్స్ చూస్తారు. అక్కడ మూడేళ్ల చిన్నారి కూడా 100 బ్రాండ్ లోగోలను గుర్తించగలరు.

అమెరికాలో 70 శాతం మంది ప్రజలు దెయ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు. ప్రతి 10 మంది అమెరికన్లలో నలుగురు రాత్రివేళ ఇంటి నుంచి ఒంటరిగా ఓ మైలు వెళ్లేందుకు కూడా వణికిపోతారు.

అమెరికాలో సింగిల్‌గా ఉన్నవారిలో 50 శాతం మంది రెండేళ్లకు మించి డేటింగ్ చెయ్యలేకపోతున్నారు. అమెరికన్లు తమ ఆదాయంలో 18 శాతాన్ని రవాణాకి ఖర్చుపెడుతున్నారు. 13 శాతాన్ని ఆహారం కోసం వెచ్చిస్తున్నారు.

ప్రతి సంవత్సరం సుమారు 2,50,000 మంది అమెరికా భర్తలు, తమ భార్యల చేతిలో శారీరక దాడులను ఎదుర్కొంటున్నారట.

అమెరికన్లు రుచులు బాగా చూడగలరు. మిగతా దేశ ప్రజల కంటే అమెరికన్ల నాలికపై రుచి నాళికలు ఎక్కువ ఉంటాయి.

అమెరికాలోని ప్రతి నలుగురిలో ఒకరు టీవీలో కనిపించిన వారే ఉంటారట.

అమెరికాలో ప్రతి ఐదుగురిలో ఒకరు హ్యాకింగ్ బాధితులే.

అమెరికన్లు తమ జీవితకాలంలో సగటున 11 ఇళ్లలోకి మారుతున్నారట. 50 శాతం మంది తాము పుట్టిన ప్రాంతానికి 100 కిలోమీటర్ల లోపే ఉంటున్నారు.

అమెరికాలోని ప్రతి 4 కుక్కల్లో ఒకటి అధిక బరువు ఉంటుంది.

ప్రస్తుతం అమెరికాలో అత్యంత ఎక్కువగా ఆనందం లేని నగరంగా న్యూయార్క్ ఉంది.

అమెరికన్లు డబ్బు, పని, ఆర్థిక సమస్యలు, కుటుంబం, మానవ సంబంధాల విషయంలో ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. వీరిలో 37 శాతం మందికి చిరాకు, కోపం వస్తున్నాయి. ఇది అయితే ఏ దేశంలో ప్రజలైనా అనుభవిస్తున్నదే అనుకోండి.

జాగ్వార్ (jaguar) అనే పదం.. అమెరికా గిరిజనుల పదమైన యాగ్వార్ (yaguar) నుంచి వచ్చింది. దాని అర్థం “ఒక్క పంజా దెబ్బతో చంపేసేది” అని.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news