అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మ్యూజియంలకు వెళ్ళారా?

-

మ్యూజియం.. పాత తరాన్ని గుర్తు చేసుకోవడానికి ఒకానొక కేంద్రం. అప్పట్లో ఎలా ఉండేవారు, ఏమి చేసేవారు, వాడిన వస్తువులు, కళ, మొదలగు విషయాల గురించి తెలియజేసేది. మానవుడు సాధించుకున్న విషయాలను గుప్పెట్లో దాచిపెట్టి ప్రపంచ ముందు తరాలకు చూపించేది. ఐతే ప్రతీ ఏడాది మే 18వ తేదీన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటారన్న సంగతి చాలా మందికి తెలియదు. మహమ్మారి కారణంగా మ్యూజియం దర్శించడం అందరికీ వీలు కావడం లేదు. అదలా ఉంచితే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మ్యూజియంలకు మీరెప్పుడైనా వెళ్ళారా? అక్కడున్న మానవ సంపదని మీరెప్పుడైనా చూసారా?

మ్యూజియం ఆఫ్ మాడర్ ఆర్ట్ (మోమా) న్యూయార్క్

1929లో మొదలైన ఈ మ్యూజియం ఒక విద్యా సంస్థగా ప్రార్ంభమైంది. ఆ తర్వాత మ్యూజియంగా మారింది. ఇక్కడ అధునిక కళలు.. పికాసో వేసిన చిత్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కళల మీద ఇష్టం ఉన్నవారు తప్పకుండా సందర్శించాల్సిన మ్యూజియం ఇది.

స్మిత్సోనియన్ మ్యూజియం.. వాషింగ్టన్ డిసి

పరిశోధనా కేంద్రంగా మొదలైన ఈ మ్యూజియంలో 1903లో రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానానికి సంబంధించిన సమాచారం ఉంది. 1846లో జేమ్స్ స్మొత్సోనియన్ దీన్ని ప్రారంభించాడు. ఆయన జ్ఞాపకార్థం స్మిత్సోనియన్ మ్యూజియంగా పేరు పెట్టారు.

లావ్రీ ప్యారిస్

మహమ్మారి కి ముందు సందర్శకుల తాకిడితో కిటకిటలాడిన ఈ మ్యూజియంలో 1200సంవత్సర కాలం నాటి నిర్మాణ కళ దర్శనమిస్తుంది. లియోనార్డో డావిన్సీ అద్భుత చిత్రకళారాజం మోనాలీసా ఇక్కడ ప్రధాన ఆకర్షణ.

బ్రిటీష్ మ్యూజియం- లండన్

1753లో స్థాపించిన ఈ మ్యూజియం 1759లో సందర్శకులకు అనుమతి ఇచ్చింది.ఈజిప్టు నాగరికతకి చెందిన అనేక వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి. ఈజిప్టు అవతల ఈజిప్టి నాగరికతకి చెందిన అనేక వస్తువులు ఉన్న మ్యూజియంగా ప్రసిద్ధి చెందింది.

మీరింత వరకు మ్యూజియం వెళ్ళలేదంటే ఒక్కసారి హైదరాబాద్ లోని సాలర్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించండి. 1951లో మొదలైన ఈ మ్యూజియంలో గంట కొట్టే గడియారం ప్రత్యేకత అందరూ చూడాల్సిందే. ఇంకా ఒకే శిలకి రెండు విభిన్న ఆకృతులు కలిగిన కళని ఖచ్చితంగా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news