5 వేల రూపాయలతో పెట్టుబడి.. నేడు 15 కోట్ల టర్నోవర్.. ఆ యువతి సక్సస్ ఫుల్ స్టోరీ

-

అమ్మాయిలకు చాలా టేస్టులు ఉంటాయి. ఒకరికి నచ్చింది మరొకరి నచ్చడం కాస్త కష్టమే.. అసలు అబ్బాయిలు వేసుకునే బట్టలతో పోలిస్తే.. అమ్మాయిలవి బోలేడు. ఎన్నో మోడల్స్ ఉంటాయి కదా.. అందుకే అమ్మాయిలకు కూడా అన్ని వెరైటీ ఫ్యాషన్స్ ఉంటాయి. అయితే చాలావరకూ.. అన్నీ రకలా ఫ్యాషన్స్ అందుబాటులో ఉండే షాప్స్ మనకు దొరకవు. ఉంటే ట్రెడిషనల్ వేర్ లేదా వెస్ట్రన్ వేర్.. ఒకవేళా రెండు ఉన్నా.. అంత డీప్ గా ఉండవు. ఏదో నామమాత్రంగా తెచ్చిపెడతారు. కానీ తమ దగ్గర ప్రతిఒక్కరి ఫ్యాషన్ అవసరాలకు సరిపడా దుస్తులు ఉన్నాయ్ అంటుంది రాజస్థాన్ లేడీ. ఈమె బిజినెస్ లో సక్సస్ అయిన తీరు చాలా మందికి ఆదర్శం. నేడు 15కోట్ల టర్న్ ఓవర్ తో సక్సస్ ఫుల్ గా వ్యాపారం చేస్తున్నఈ యువతి కథ స్పూర్తిదాయకమే..!
రాజస్థాన్‌ బిల్వారాకు చెందిన పూజా ఛౌదరి. తన తండ్రి కోరిక మేరకు సివిల్స్‌ చదవడానికి సిద్ధమైంది. కానీ తన అంతిమ లక్ష్యం అది కాదని తెలుసుకుంది. ఫ్యాషన్‌పై మక్కువతో సొంత లేబుల్‌ని ప్రారంభించి.. రంగుల దగ్గర్నుంచి డిజైన్ల దాకా ఈ కాలపు అమ్మాయిల కోరిక మేరకు దుస్తులు రూపొందించడం స్టాట్ చేసింది.
పూజను సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా చూడాలనేది ఆమె తండ్రి కల. కానీ తనకేమో ఫ్యాషన్‌ రంగంపై మక్కువ. అయినా తన తండ్రిని నిరుత్సాహపరచడం ఇష్టం లేని ఆమె.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి జైపూర్‌ వెళ్లింది. కానీ అక్కడే తన ఫ్యాషన్‌ కలకు బీజం పడిందట.
తనకు ఫ్యాషన్ ప్రపంచం ఉన్న ఇష్టాన్ని తండ్రితో పంచుకుని.. సివిల్స్ ను పక్కన పెట్టి ఈ రంగలోకి అడుగులు వేసింది. అయితే ఇష్టం మాత్రం ఉంది కానీ.. అందులో వ్యాపార మెళుకువలు అప్పటికి పూజకు తెలియదు. చదువుకు సంబంధం లేని రంగం. పాకెట్ మనీ 5 వేలుతో 2018లో ‘లావణ్య – ది లేబుల్‌’ అనే ఆన్‌లైన్‌ స్టోర్‌ని ప్రారంభించిందట.
ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇప్పుడొస్తున్న ట్రెండ్స్‌ గురించి ఇంటర్నెట్ ద్వారా అవగాహన పొందింది. ఇందులో నైపుణ్యాల్ని పెంచుకుని.. స్థానికంగా క్లాత్ కొనుగోలు చేసి.. నిపుణులతో విభిన్న దుస్తులు కుట్టించి తన స్టోర్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచేదట. సంప్రదాయ, మోడ్రన్‌, ఇండో-వెస్ట్రన్‌ స్టైల్స్‌.. ఇలా నేటి అమ్మాయిల అభిరుచులకు తగినట్లుగా రూపొందించిన ప్రతి ఫ్యాషన్‌ తమ వద్ద లభిస్తుంది.. అలాగే ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న రంగులు, ప్రింట్ల విషయంలోనూ ఎప్పటికప్పుడు ఆమె అప్‌డేట్‌ అవుతూ వచ్చేది. ఇలా ప్రత్యేక సందర్భాల్లో ధరించే దుస్తులతో పాటు నైట్‌వేర్‌, ఫుట్‌వేర్‌.. వంటివీ తమ వద్ద అందుబాటులో ఉన్నాయంటోందీ ఫ్యాషనర్ పూజ.
ఈ క్రమంలో బిల్వారాలో ఓ కంపెనీని ప్రారంభించిన పూజ.. ఎంతోమంది మహిళలకు ఉపాధి సైతం కల్పిస్తోంది. మరోవైపు Myntra, Nykaa.. వంటి ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌లతోనూ కలిసి పనిచేయడం విశేషం.. అలాగే కొంతమంది సెలబ్రిటీలకూ ఆయా సందర్భాలకు తగినట్లుగా దుస్తులు రూపొందిస్తోందట.
 వినియోగదారులకు నచ్చిన దుస్తుల్నీ డోర్‌ డెలివరీ చేస్తారు.ఇలా 5వేల పెట్టుబడితో అడుగు ముందుకేసిన పూజ.. తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. ఈరోజు ఏడాదికి రూ.15 కోట్ల టర్నోవర్కు చేరుకుంది. వ్యాపారం అంటే కత్తిమీద సాము లాంటిది. అటూఇటూ అయితే అది మెడకు చుట్టుకుంటుంది. లాభాలే కాదు.. నష్టాలు కూడా వస్తాయి. వంద తలనొప్పులు ఉంటాయి. సరైన సమయంలో డెలివరీ కాకపోతే.. కస్టమర్స్ దగ్గర ఉన్న గుడ్ విల్ పోతుంది. మానసికంగా, శారీరంగా ఎంతో ఒత్తిడికి లోనవ్వాలి. అలాంటప్పుడే నిబద్ధతతో అడుగుముందుకు వేయాలంటోది పూజ.
మనసుకు నచ్చిన పని చేసేప్పుడు ఎన్ని సవాళ్లనైనా అధిగమించవచ్చు. ఎంత కష్టాన్ని అయినా దాటేయొచ్చు. మనలో కూడా చాలామందికి ఏదేదో చేయాలనే ఆశ ఉంటుంది. పరిస్థితులు అనుకూలించక వాటిని పక్కన పెట్టేస్తాం. ఏమో మన లైఫ్ అందులోనే ఉందేమో.. ఎందుకు ప్రయత్నించి చూడకూడదు..! కానీ వదలకుండా శ్రమించినప్పుడే.. సక్సస్ స్టోరీ మనది అవుతుంది.
                                            -Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version