ఈ జాగ్రత్తలని పబ్లిక్ టాయిలెట్స్ లో, ట్రయల్ రూమ్ లో తీసుకుంటే మంచిది..!

-

మనం ఏదైనా టూర్ కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా బయటకి వెళ్లినా కొన్ని కొన్ని సార్లు ట్రయిల్ రూమ్స్ ని మరియు పబ్లిక్ టాయిలెట్స్ ని ఉపయోగించాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైనా సరే పబ్లిక్ టాయిలెట్స్ ని కానీ ట్రయల్ రూమ్స్ ని కానీ ఉపయోగించాలనుకుంటే జాగ్రత్త పడే అవసరం ఎంతైనా ఉంది.

 

కొందరు కీచకులు ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. స్పై కెమెరాలు, హిడెన్ కెమెరాలనీ పెట్టి చిత్రీకరించే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్స్ ని కానీ ట్రయిల్ రూమ్స్ ని కి కానీ వాడుతుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే అనవసరంగా మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

మీరు ఎప్పుడైనా ట్రయిల్ రూమ్స్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ ని కానీ ఉపయోగించాలనుకుంటే ఏదైనా చిన్న రంధ్రాలు కనబడితే చెక్ చేయండి. ఎందుకంటే అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
అలానే మీరు ట్రయిల్ రూమ్ కి వెళ్ళినప్పుడు అద్దం సింగిల్ సైడెడ్ ఆ డబల్ సైడెడ్ ఆ అనేది కూడా చూసుకోవాలి దీనిని ఎలా గమనించాలంటే వేలి మధ్య గ్యాప్ ఉంటే అది సింగిల్ సైడ్ అని లేకపోతే అది డబల్ సైడెడ్ అని గుర్తుంచుకోవాలి.

అలానే మీరు ట్రయిల్ రూమ్ లో ఫోన్ ని ఉపయోగించినప్పుడు స్పై కెమెరాలు ఉంటే సిగ్నల్ సమస్యలు వస్తాయి, కాల్ డ్రాప్ అవుతుంది గమనించండి. మీరు సీక్రెట్ కెమెరా ని గుర్తించాలంటే రూమ్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఆ తర్వాత ఫ్లాష్ లైట్ వేసి చూడండి. అప్పుడు మీకు ఏదైనా బల్బు వెలగడం లాంటివి కనపడతాయి ఇలా ఉంటే కెమెరా ఉన్నట్లు మీరు గుర్తించొచ్చు.

అదేవిధంగా కెమెరా డిటెక్టర్ యాప్స్ కూడా ఉంటాయి వాటిని ఇన్స్టాల్ చేసి కూడా మీరు కెమెరా ఉందా లేదా అనేది కనిపెట్టొచ్చు. ఇలా మీరు ఈ టెక్నిక్స్ ని ఫాలో అయితే ట్రైల్ రూమ్ లో పబ్లిక్ టాయిలెట్స్ లో కెమెరాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. జాగ్రత్త పడడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news