‘సైకిల్‌ గర్ల్‌’కు రాష్రీయ బాల్‌ పురస్కార్‌..!

-

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో రవాణా అంత ఎక్కడికక్కడే స్తంభించింది. రోడ్డుపై ఏ ఒక్క వాహనం నడిచేది కాదు. ఎలాగైన సరే తన తండ్రితో పాటు సొంత గ్రామానికి చేరుకోవాలనే లక్ష్యంతో తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని సుదీర్ఘ ప్రయాణంతో సొంతూరికి చేరుకున్న జ్యోతి కుమారికి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ఆమె ధైర్యాన్ని మెచ్చిన ప్రభుత్వం ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ అందజేసింది.

ఈ సందర్భంగా పధాని మోదీ జ్యోతి కుమారిపై ట్విటర్‌ వేదికగా ప్రశంశించారు.‘జ్యోతి చూడటానికి తన తోటి పిల్లల్లాగే కనిపిస్తుంది.. కానీ ఆమె చూపిన ధైర్యసాహసాల గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. అనారోగ్యం బారిన పడిన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1,200 కి.మీప్రయాణం చేసింది. బాల్‌ పురస్కార్‌ అందుకున్న బిహార్‌ దర్భాంగాకు చెందిన జ్యోతి కుమారికి శుభాకాంక్షలు. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి’ అంటూ ప్రధాని ట్విటర్‌లో ఆకాంక్షించారు.

ఇవాంక సైతం..

హర్యానాలోని గుర్‌గ్రాంలో ఈ–రిక్షా నడిపే జ్యోతి కుమారి తండ్రి పాశ్వాన్‌ ప్రమాదానికి గురి కావడంతో ఇంటి అద్దె చెల్లింలేక ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఇంటి యజమాని ఇల్లుఖాళీ చేయాలని ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.ఏ మాత్రం భయపడని జ్యోతి తండ్రికి ధైర్యం చెప్పి ఎలాగైనా సొంతూరికి వెళ్లిపోదామని, తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని మధ్య మధ్యలో ఆగుతూ సింగ్వారాకు తీసుకువచ్చింది. అక్కడికి చేరుకున్న వారు క్వారంటైన్‌లో ఉండి తమ ఇంటికి వెళ్లిపోయారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ çకూతురు ఇవాంక ట్రంప్‌ సహా ఎంతో మంది ప్రముఖులు జ్యోతి కుమారిని ట్విటర్‌ వేదిగా అభినందనలతో ముంచెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news