Kaivalya Vohra : 21 ఏళ్లకే రూ. 3600 కోట్ల ఆస్తి.. యంగెస్ట్ బిలియనీర్‌ కైవల్య వోహ్రా ఎవరంటే..?

-

Kaivalya Vohra: హురూన్ ఇండియా రిచ్ లిస్టు 2024 రిలీజ్ చేశారు. దేశంలోని బిలినియర్లకు సంబంధించిన కీలక నివేదికని హురూన్ ఇండియా నివేదించింది. ఇండియాలో అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచిన 20 ఒకేళ్ళ కుర్రాడు పై అందరి దృష్టి పడుతోంది. అతను ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో సహా వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా భారత్ లోని సంపన్నుల జాబితాలో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇతని ఆస్తి ప్రస్తుతం 3600 కోట్లుగా ఉన్నట్లు హురూన్ ఇండియా నివేదిక చెప్పింది. ఈ జాబితాలో కైవల్య అగ్రస్థానంలో ఉన్నారు. జెప్టో మరో సహా వ్యవస్థాపకుడు అదిత్ పాలిచా తర్వాత స్థానంలో ఉన్నారు.

కైవల్య వోహ్రా ఎవరు..?

ఇతను స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సులో కైవల్య అదిత్ ఇద్దరూ కలిశారు. చదువును మధ్యలోనే ఆపేసి బిజినెస్ లోకి దిగారు. కరోనా మహమ్మారి సమయంలో క్విక్ డెలివరీ కాంటాక్ట్ లెస్ డెలివరీస్ కి డిమాండ్ బాగా పెరిగింది. క్విక్ కామర్స్ లోకి అడుగు పెట్టాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. జెప్టో ని మొదలుపెట్టారు. అప్పటికే అమెజాన్ వంటివి ఉన్నాయి. వాటికి పోటీగా నిలబడ్డారు.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో మొదటిసారి చోటు దక్కించుకున్నారు కైవల్య. అతని వయసు 19 ఏళ్ళు. ఇప్పుడు ఈ ఏడాది హురున్ ఇండియా రిచ్ లిస్టులో దేశంలో బిలియన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వినోదం, కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలు ఈ లిస్టులో ఉన్నారు. 2024లో లిస్టులో 11.61 లక్షల కోట్లతో అదానీ అగ్రస్థానంలో ఉన్నారు తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 10.14 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు

Read more RELATED
Recommended to you

Latest news