ఇన్‌స్టంట్ బీర్… బీరు ప్రియులకు వరం..!

-

ఎప్పుడు కావాలంటే అప్పుడు… ఎక్కడ కావాలంటే అక్కడ బీర్ ను లాగించేయాలంటే ఎలా? ఏం చేయాలి? దీనికి సమాధానమే కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ మిక్స్.

అబ్బబ్బ.. ఎండలు మండిపోతున్నాయిరా.. అరెయ్.. వెళ్లి ఓ కేసు బీరు పట్టుకురారా? తాగేద్దాం. ఎండ వేడిలో చిల్డ్ బీరు తాగితే ఉంటది.. హా.. ఆ మజాయే వేరురా అబ్బాయ్. పోరా.. వెళ్లి తీసుకురా. కేసు బీర్లు అంటే ఎలా పట్టుకురావాలి. నావల్ల కాదు. ఒకటి రెండు బీర్లయితే తెస్తా? ఏంటి ఈ బీర్ల గోల అంటారా?

Kingfisher introduces Kingfisher Instant Beer

మీరు ఎక్కడికైనా వెళ్లలారనుకోండి. అక్కడ మీకు బీరు తాగాలనిపించిందనుకోండి. ఏం చేస్తారు.. అక్కడ ఏవైనా బీరు షాపులు ఉన్నాయా అని చెక్ చేస్తారు. ఒకవేళ లేకపోతే అంతే సంగతులు. బీరు తాగాలనే మీ కోరిక మాత్రం నెరవేరదు. మీరు వైన్ షాప్ కు వెళ్లారనుకోండి. ఒకేసారి ఓ పది ఇరవై బీర్లు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటారు. కానీ.. మీరు ఒక్కరే అన్ని మోసుకెళ్లలేరు. ఒకటి రెండు అయితే తీసుకెళ్లగలరు కానీ.. ఎక్కువ సంఖ్యలో బీర్లు తీసుకెళ్లాలంటే కష్టమే. మరి.. ఎలా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు… ఎక్కడ కావాలంటే అక్కడ బీర్ ను లాగించేయాలంటే ఎలా? ఏం చేయాలి? దీనికి సమాధానమే కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ మిక్స్.



అవును.. చిన్న చిన్న ప్యాకెట్లలో పొడి రూపంలో ఇప్పుడు కింగ్ ఫిషర్ బీరు ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. బీరు సాచెట్స్ అంటారు వాటిని. ఆ సాచెట్స్ తో బీరు తయారు చేయడం చాలా ఈజీ. మీదగ్గర బీరు సాచెట్స్, నీళ్లు ఉంటే చాలు. ఇన్ స్టంట్ బీరును ఇన్ స్టంట్ గా తయారు చేసుకోవచ్చు. జస్ట్.. నీళ్లలో బీరు పొడి వేసి కలిపి తాగేయడమే. టేస్ట్ ఏ మాత్రం తగ్గదు. మీరు జస్ట్ సాచెట్స్ ను మీ దగ్గర ఉంచుకుంటే చాలు. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఇన్ స్టంట్ గా బీరును తాగేయొచ్చు. ఏంటి నమ్మకం కలగట్లేదా? అయితే ఈ వీడియో చూడండి.. మీకు ఫుల్లు క్లారిటీ వస్తది..

Read more RELATED
Recommended to you

Latest news