స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ దాని సెక్యూరిటీ గురించి తెలుసుకోవల్సిందే..

-

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని వారే లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దాని ద్వారానే ఫోటోలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో షేర్ చేస్తాం, ఆర్థిక లావాదేవీలు జరుపుతాం. ఇంకా ఎన్నో చేస్తున్నాం. ఐతే స్మార్ట్ ఫోన్ ఉన్న అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంటర్నెట్ ని విరివిగా వాడుతున్న ప్రస్తుత తరుణంలో హ్యాకర్స్ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. అందుకే స్మార్ట్ ఫోన్ ఉన్న వారు దాని సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలి.

వైరస్ ప్రొటెక్షన్

కంప్యూటర్ లాగే ఫోన్ కూడా వైరస్ కి గురవుతుంది. అందుకని దానికి యాంటీవైరస్ సాఫ్ట్ వేరే ఖచ్చితంగా ఉండాల్సిందే.

ప్రైవసీ

మీకు చాలా దగ్గరి వాళ్ళైనా సరే ప్రైవసీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ ఫోన్ చూస్తే చాలు.

యాప్స్ ని మేనేజ్ చేయాలి

మీకు నచ్చిన యాప్ వేసుకున్నారు. అది కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఇవ్వకండి. దానిలో మీకేవీ ఉపయోగపడతాయో చూసుకునే పర్మిషన్స్ ఇవ్వండి.

అప్పుడప్పుడు వైరస్ వార్నింగ్ అని చెబుతూ మెసేజెస్ వస్తుంటాయి. వాటిపై క్లిక్ చేయవద్దు. హ్యాకర్స్ ఈ విధంగా సమాచారం దొంగిలించాలని చూస్తుంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీ మెసేజ్ లని భద్రంగా ఉంచుకోండి. మెసెజింగ్ యాప్ లకి లాక్ ఉంచుకునే సదుపాయం చూసుకోండి.

చాలా మంది ఫోన్ కి సరైన లాక్ పెట్టుకోరు. కానీ సరైన లాక్ చాలా అవసరం. అందరికీ తెలిసేలా కాకుండా ఉంటే మంచిది.

పబ్లిక్ వైఫై వాడేముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రీగా వస్తున్నదని వాడవద్దు. ఫ్రీగావచ్చే దానిద్వారా మరెన్నో అటాక్ చేస్తుంటాయి. అందుకే ప్రతీ చోట వైఫై కనెక్ట్ చేసుకోవద్దు.

ఒకవేళ ఫోన్ ఎక్కడైనా పోయినట్లైతే రికవరీ చేసుకోవడానికి వీలుగా అందులో ఒక యాప్ ఉండేలా చూసుకోండి. ఐఫోన్లలో ఈ ప్రత్యేకత ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news