బర్గర్ కోసం అలిగిన పిల్లాడి వీడియో వైరల్..!

-

మీ స్నేహితులు కానీ మీ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ బయటికి వెళ్లి ఏమైనా ఫుడ్ తెచ్చుకుని మీ కోసం తీసుకు రాకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నిజంగా చాలా ఇదిగా ఉంటుంది కదా..? అవును కచ్చితంగా ఎవరికైనా ఇలాగే ఉంటుంది.మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకి మరింత బాధగా ఉంటుంది. తాజాగా ఒక పిల్లవాడు బర్గర్ ఇవ్వలేదని గోల చేసిన ఒక వీడియో వైరల్ అయ్యింది ఇక ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఈ పిల్లాడి సోదరి తనకి పెట్టకుండా బర్గర్ ఆర్డర్ పెట్టుకుని తినేసింది.

ఈ ఒక్క నిమిషం 18 సెకన్ల వీడియోలో మనం ఆ పిల్లవాడు బర్గర్ పెట్టలేదని బాధపడిన సన్నివేశం మనం చూడొచ్చు. నువ్వు నాతో మాట్లాడకు అని తన సోదరితో చెప్పడం, అదే విధంగా నేను తినను నీ బర్గర్ నువ్వే తినొచ్చు అని అనడం ఈ వీడియోలో మనం చూడొచ్చు.

 

వీడియో తీస్తున్న అమ్మాయి తనని ఏడిపిస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో ఇప్పుడు తెగ షికార్లు కొడుతోంది. మంచి రెస్పాన్స్ కూడా తిరిగి వచ్చింది. బర్గర్ కోసం అంతలా బాధ పడక్కర్లేదు అని కొందరంటే, బర్గర్ పెట్టండి అని కొందరు కామెంట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news