ఇంటర్నేషనల్ బర్గర్ డే: ఈ బర్గర్లను ఎప్పుడైనా ప్రయత్నించారా?

-

ఫాస్ట్ ఫుడ్ ఇష్టపడేవారిలో బర్గర్ ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా బర్గర్లని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదటగా బర్గర్లని 1900ప్రాంతంలో తయారు చేసారని నమ్ముతారు. దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న బర్గర్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బర్గర్ సెంటర్లు ఉన్నాయి. మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్ మొదలగునవన్నీ వివిధ రకాల బర్గర్లని ఆహార ప్రియులకు అందజేస్తున్నాయి. బర్గర్గలని ఇష్టపడేవారు ఎప్పుడైనా కింద ఇచ్చిన 4 ప్రత్యేకమైన బర్గర్లని రుచి చూసారా? లేదంటే ఇప్పుడే ప్రయత్నించండి.

న్యూయార్క్ ఛీజ్ బర్గర్

జున్ను, పాలకూర, ఊరగాయ, మయనీస్, కెచప్, ఆవాలు మొదలైనటువంటి పదార్థాలతో తయారయ్యే ఈ బర్గర్ ని అమెరికన్లు ఎక్కువగా ఇష్టపడతారు. దీనిలో జున్ను ప్రత్యేకంగా ఉంటుంది. మాంసాహారం, శాఖాహారంలో లభించే ఈ బర్గర్ ని ఒక్కసారి రుచి చూడండి.

వెన్న బర్గర్

వెన్న ఇష్టమున్నవారు ఈ బర్గర్ ని ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇందులో వాడే ప్రతీ పదార్థాన్ని వెన్నతో యాడ్ చేస్తారు. వెన్నలో వేయించిన ఉల్లిపాయలు, వెన్నలో ఉడికించిన రొట్టెముక్కలు మొదలగునవి. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. మీ దగ్గర్లోని బర్గర్ హౌస్ లో ఒక్కసారి రుచి చూడండి.

బ్రెజిల్ గ్రిల్ బర్గర్

ఇందులో బ్రెజిలియన్న్ రుచులు ఉంటాయి కాబట్టి దీన్ని బ్రెజిల్ బర్గర్ అంటారు. జీలకర్ర, మయనీస్, ఉల్లిపాయ, అవొకోడో మొదలగునవి ఇందులో ఉంటాయి. అంతర్జాతీయ రుచి చూద్దాం అనుకున్నవారికి మంచి ఎంపిక.

మష్రూమ్ బర్గర్

పుట్టగొడుగులతో తయారు చేసే ఈ బర్గర్లో జున్ను కూడా ఉంటుంది. అంతేకాదు మంచి రుచిని కలిగి ఉండి అధిక కేలరీలతో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news