లవ్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నారా..? ఈ టిప్స్ ని ఫాలో అయితే ఎవరైనా ఫిదా అయిపోతారు..!

-

సాధారణంగా మనసులో ఇష్టం కలగడం సహజం. అది అబ్బాయికి అయినా అమ్మాయికి అయినా. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమ కలగొచ్చు. అయితే మనం ప్రేమించే వ్యక్తి కూడా తిరిగి మనల్ని ప్రేమించాలంటే నిజంగా యుద్ధం చేయాలి అని అనుకుంటారు చాలా మంది. పైగా వాళ్లని పడేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 

ఎక్కువగా అబ్బాయిలు అమ్మాయిలని పడేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక అమ్మాయి అతడిని ప్రేమించడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. అహర్నిశలు ఆమె కోసమే ఆలోచిస్తూ ఉంటారు. అయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు తిరిగి వాళ్ళని కూడా ప్రేమించాలంటే వీటిని ఫాలో అవ్వండి. అప్పుడు కచ్చితంగా వాళ్లు మీకు ఫిదా అయిపోతారు. మరి ఎలా పడేయాలన్నది చూద్దాం.

బాగా పొగడడం:

మీకు నచ్చిన వ్యక్తిని మీరు బాగా పొగిడితే వాళ్లు మిమ్మల్ని ఇష్టపడతారు. అయితే ఇది రియల్ గా ఉండాలి. చూడడానికి ఫేక్ గా ఉంటే బిస్కెట్ వేస్తున్నారని అనుకుంటారు. మీ డ్రెస్ బాగుందని, మీరు చాలా అందంగా ఉన్నారని ఇలా కాంప్లిమెంట్స్ ఇవ్వండి. దాంతో వాళ్లు మీకు క్లోస్ అయిపోతారు.

నిజాయితీగా ఉండడం:

దేనిలో అయినా నిజాయితీగా ఉండాలి. నిజాయితీకి వెయిట్ ఎక్కువ ఉంటుంది. పైగా నిజాయితీగా ఉంటే ఛీ కొట్టే అవకాశం చాలా తక్కువ. కాబట్టి వీలైనంత వరకు నిజాయితీగా ఉండండి.

వారికి నచ్చిన విధంగా ఫాలో అవ్వడం:

అమ్మాయి లేదా అబ్బాయి కి ఇష్టమైన ట్లు అనుసరించారు అంటే కచ్చితంగా వాళ్ళ ఫిదా అయిపోతారు. వాళ్ల అభిరుచులకు తగ్గట్టు మీరు ఫాలో అయితే తప్పక ప్రేమలో పడతారు.

ప్రతి విషయాన్ని చెప్పండి:

మీరు చేసే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకోండి. దీనితో వాళ్లు కూడా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడతారు. ఇలా నెమ్మదిగా వాళ్లు మిమ్మల్ని ఇష్టపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news